MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 17.03.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 17 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

Related Articles

Related image1
Saturn Transit: రేవతి నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి పంట పండినట్లే, డబుల్ జాక్‍పాట్!
Related image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది.. మీ రాశి ఉందా?!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

స్త్రీ సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమవుతుంది. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఇంటా బయటా మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృథా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కంటి సంబంధిత సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆర్థికంగా ఒడిదుడుకులు అదికమవుతాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త అప్పులు చేయకపోవడం మంచిది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

రాజకీయ వర్గం నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుంచి ఆశించిన డబ్బు సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో శ్రమతో కానీ పనులు పూర్తికావు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Related Stories
Recommended image1
Saturn Transit: రేవతి నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి పంట పండినట్లే, డబుల్ జాక్‍పాట్!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది.. మీ రాశి ఉందా?!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved