Zodiac Signs: 6 రోజులు ఓపిక పడితే.. ఈ ఐదు రాశులకు ఊహించని డబ్బు వస్తుంది!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 15 నుంచి ఒక వారం రోజులు సూర్యుడు, బుధుడు, గురువు మిథున రాశిలో సంచరించనున్నారు. ఈ మూడు గ్రహాల కలయిక కొన్ని రాశులవారికి శుభప్రదం. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
వృషభ రాశి
వృషభ రాశి వారికి ధన స్థానంలో ఈ అరుదైన శుభ యోగం ఏర్పడనుంది. కాబట్టి ఆర్థిక విషయాలకు సంబంధించి ఏ ప్రయత్నమైనా కలిసివస్తుంది. ఆర్థిక లావాదేవీలు, లాటరీ, షేర్లు మొదలైనవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. సంపద పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి దక్కే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తీరిపోయి.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి మూడు గ్రహాల కలయిక.. చాలా ప్రయోజనకరం. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. సమాజంలో హోదా, గౌరవం పెరుగుతాయి. ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇల్లు, వాహన కొనుగోలు ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆస్తుల విలువ గణనీయంగా పెరుగుతుంది. ప్రముఖులతో సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభానికి కొదవ ఉండదు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి.
కన్య రాశి
కన్య రాశిలో పదవ స్థానంలో త్రిగ్రహి యోగం ఉండటం వల్ల వృత్తి జీవితంలో రాజయోగం ఉంటుంది. ఉద్యోగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
తుల రాశి
తుల రాశి వారి అదృష్ట స్థానంలో ఈ అరుదైన యోగం ఏర్పడనుంది. కాబట్టి ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు లభించే అవకాశం ఉంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం ఉంటుంది. తండ్రి వైపు నుంచి ఆస్తులు వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంతిల్లు కల నేరవేరే అవకాశం ఉంది. అదృష్టం వీరి వెంటే ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో ఈ మూడు గ్రహాలు ఏడవ స్థానంలో ఉండటం వల్ల వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ధనవంతులైన కుటుంబంలోని వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో అధికార యోగాన్ని పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.