MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Saturn Transit: రేవతి నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి పంట పండినట్లే, డబుల్ జాక్‍పాట్!

Saturn Transit: రేవతి నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి పంట పండినట్లే, డబుల్ జాక్‍పాట్!

జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శని సంచారం వ్యక్తుల జీవితాలపై మంచి, చెడు ప్రభావాలను చూపిస్తుంది. త్వరలో శని నక్షత్రం మార్చనున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశులవారికి అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ఆ రాశులేవో చూద్దామా..

2 Min read
Author : Kavitha G
Published : Mar 16 2026, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రేవతి నక్షత్రంలోకి శని
Image Credit : Asianet News

రేవతి నక్షత్రంలోకి శని

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని నక్షత్ర మార్పు వ్యక్తుల జీవితంలో ఆర్థిక స్థితి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ జీవితం వంటి అనేక అంశాలపై ప్రభావం చూపుతుంది. శని ప్రస్తుతం ఉత్తరభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. మే 17న రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. రేవతి నక్షత్రం బుధ గ్రహాధిపత్యం కలిగిన శుభ నక్షత్రం. ఈ నక్షత్రంలో శని ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఆ రాశులేవో ఇక్కడ చూద్దాం.

25
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి శని సంచారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారికి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆలస్యంగా సాగుతున్న పనులు ఈ సమయంలో పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారులకు కూడా కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునే వారికి శని మార్పు సహాయపడుతుందని పండితులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. త్వరగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు!
Related image2
Zodiac Signs: ఈ 7 రాశులవారిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం పండగే.. ఎంత బాగా చూసుకుంటారో!
35
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

మిథున రాశి వారికి శని నక్షత్ర మార్పు మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం ఉంది. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితం లభిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నవారికి మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ప్రణాళికలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. కుటుంబం జీవితం సంతోషకరంగా ఉంటుంది. 

45
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కూడా శని నక్షత్ర మార్పు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్య, విదేశీ అవకాశాలు, ప్రయాణాల వంటి విషయాల్లో శుభఫలితాలు కనిపించవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఈ సమయంలో రావచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. అయితే ఈ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. 

55
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశి వారికి శని నక్షత్ర మార్పు ప్రత్యేకమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితంలో మార్పులు ఉంటాయి. కష్టానికి తగిన గుర్తింపు దక్కుతుంది. కొత్త బాధ్యతలు, అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి రావణుడి లక్షణాలు ఎక్కువ, ప్రాణం పోతున్నా వెనక్కి తగ్గరు
Recommended image2
Vastu tips: భర్తకు భార్య ఏ వైపున నిద్రపోతే వారి బంధం బలపడుతుంది? వాస్తు శాస్త్రం సూచనలు ఇవే
Recommended image3
Ugadi 2026: పరాభవనామ ఉగాది.. మకర రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండనుంది..?
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. త్వరగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు!
Recommended image2
Zodiac Signs: ఈ 7 రాశులవారిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం పండగే.. ఎంత బాగా చూసుకుంటారో!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved