Birth Date: ఈ తేదీల్లో పుట్టినవాళ్లు చాలా ఫాస్ట్ గా ఫేమస్ అవుతారు!
ప్రతి ఒక్కరూ జీవితంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వీరు చాలా ఫాస్ట్ గా ఫేమస్ అవుతారు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు ఇలా ఉంటారో చూద్దామా.

సంఖ్యాశాస్త్రం ప్రకారం..
సంఖ్యా శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇప్పటికీ జ్యోతిష్య, సంఖ్యా శాస్త్రాలను చాలామంది నమ్ముతారు. ఫాలో అవుతారు. సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వీరు చాలా త్వరగా పేరు, ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు ఈ అదృష్టాన్ని కలిగి ఉన్నారో ఇక్కడ చూద్దాం.
సంఖ్యా శాస్త్రం ప్రకారం మూలసంఖ్య ఆధారంగా వ్యక్తుల జీవితం గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 1. ఈ సంఖ్య కలిగిన వ్యక్తులు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ గుణం వల్ల జీవితంలో విజయం సాధిస్తారు.
మూల సంఖ్య 1 కలిగిన వ్యక్తులు..
మూల సంఖ్య 1 కి అధిపతి సూర్యుడు. సూర్యుడిని శక్తి స్వరూపంగా భావిస్తారు. సూర్యుడి ప్రభావంతో వీరికి శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ తేదీల్లో పుట్టినవారికి ధైర్యం ఎక్కువ. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనకాడరు. తోటి వారికి సహాయం చేయడంలో వీరు ముందుంటారు.
నిజాయతీగా ఉంటారు..
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారు జీవితంలో చాలా త్వరగా పేరు, ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ప్రగతి, అదృష్టం వీరి వెంటే ఉంటుంది. అంతేకాదు. మూలసంఖ్య ఒకటి కలిగినవారు నిజాయతీగా, బాధ్యతగా ఉంటారు. ఏ పనిలోనైనా కష్టపడి విజయం సాధిస్తారు.
ఆకర్షణీయమైన వ్యక్తిత్వం..
మూలసంఖ్య ఒకటి కలిగిన వ్యక్తులు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరిని ఎవరైనా సరే చాలా త్వరగా ఇష్టపడతారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. తోటివారిని ప్రభావితం చేసే సామర్థ్యం ఉంటుంది. వీరు ఎంత కష్టం వచ్చినా దాన్ని సంతోషంగా ఎదుర్కొంటారు.
ఈ 4 తేదీల్లో పుట్టిన వారు చాలా సౌమ్యంగా ఉంటారు. సరళ స్వభావం కలిగి ఉంటారు. తాము ఏ పనిచేసినా ఎవరికీ నష్టం, బాధ కలగవద్దని కోరుకుంటారు. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
స్వతంత్రంగా జీవిస్తారు..
మూలసంఖ్య 1 కలిగిన వారు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. ఎవరిపై ఆధారపడి జీవించడం వీరికి నచ్చదు. కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బంది పడతారు.
ఒకటి మూలసంఖ్య ఉన్నవారు ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే 1, 10, 19, 28 తేదీల్లో చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.