సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి మూలసంఖ్యకీ ఒక ప్రత్యేకత ఉంటుంది.  దీని సాయంతో వారి స్వభావం, భవిష్యత్ ఇతర విషయాలు తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టినవారు రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువట. మరి ఆ తేదీలేంటో చూసేయండి.  

పెళ్లి చాలా ప్రత్యేకమైంది. పవిత్రమైంది. ఈ బంధం ఇద్దరు వ్యక్తులను జీవితాంతం కలిసి ఉంచుతుంది. అయితే కొందరు.. కొన్ని కారణాలతో పెళ్లి అయిన కొద్ది రోజులకే విడిపోతుంటారు. తర్వాత జీవితం వారికి నచ్చినట్లుగా బతికేస్తుంటారు. కొందరు మళ్లీ పెళ్లి చేసుకుంటారు. మరికొందరు ఒంటరిగానే జీవితం కొనసాగిస్తారు. సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు మొదటి భాగస్వామితో విడిపోయి.. రెండవ పెళ్లి చేసుకుంటారట. మరి ఏ తేదీల్లో పుట్టిన వారికి రెండో పెళ్లి అవకాశాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

ఏ తేదీల్లో పుట్టిన వారికి రెండో పెళ్లి అవకాశాలు ఎక్కువ?

ఏ నెలలో అయినా 5, 14 లేదా 23 తేదీల్లో పుట్టిన వారి మూలసంఖ్య 5. ఈ సంఖ్యపై బుధ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి చురుకైన మనస్సు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ధైర్య స్వభావం అందరినీ ఆకట్టుకుంటాయి. వీరు తమదైన శైలిలో జీవిస్తారు. ఇతరులతో త్వరగా కలిసిపోతారు.

5 మూలసంఖ్య కలిగిన వారి ప్రేమ, వివాహ జీవితం

మూలసంఖ్య 5 కలిగిన వ్యక్తులు త్వరగా అందరితో కలిసిపోతారు. అందరిని ఫ్లర్ట్ చేస్తారు. వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఈ స్వభావం వల్ల కొన్నిసార్లు వివాహేతర సంబంధాల వైపు ఆకర్షితులు కావచ్చు.

రెండు పెళ్లిళ్లు అయ్యే అవకాశం

ఈ 3 తేదీల్లో పుట్టిన వారు స్వతంత్రంగా ఆలోచిస్తారు. వీరికి మొదటి పెళ్లిలో సమస్యలు ఎదురవుతాయి. దానివల్ల రెండో పెళ్లి అయ్యే అవకాశం ఉంటుంది.

స్థిరత్వం, బాధ్యత సమస్యలు

వీరు త్వరగా బంధంలో ఇరుక్కుపోవడానికి ఇష్టపడరు. పెళ్లయినా స్థిరత్వం కాపాడుకోవడం కష్టం. వీరికి స్వేచ్ఛ ఇష్టం, సంబంధంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటారు.

ఎవరితో బాగా కలిసిపోతారు?

మూలసంఖ్య 5 కలిగిన వారికి మూలసంఖ్య 1, 3, 6 ఉన్నవారు మంచి జీవిత భాగస్వాములు అవుతారు. 2, 7 సంఖ్యల వారితో వీరికి పొసగదు. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువ.

వీరి వృత్తి జీవితం ఎలా ఉంటుందంటే..

ఈ తేదీల్లో పుట్టిన వారు రిస్క్‌ చేయడానికి భయపడరు. మాటతీరుతో ఎవరినైనా ప్రభావితం చేయగల నైపుణ్యం ఉండటం వల్ల వీరు మంచి వ్యాపారవేత్తలు అవుతారు. మార్కెటింగ్, మీడియా రంగాల్లో మంచి కెరీర్ ఉంటుంది.

ఆరోగ్యం, బలహీనతలు

వీరు త్వరగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఎక్కువగా ఆలోచించడం వల్ల త్వరగా అలిసిపోతారు. కొన్ని చెడు అలవాట్లు, క్రమశిక్షణ లేకపోవడం వీరి బలహీనత.