సంఖ్యాశాస్త్రం ప్రకారం జన్మ సంఖ్య ఆధారంగా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒక్కో సంఖ్యకు ఒక్కో జంతువు లక్షణాలున్నాలు ఉంటాయట. మీ వ్యక్తిత్వం గురించి లోతుగా తెలుసుకోవాలంటే.. మీ జన్మ సంఖ్యకు ఏ జంతువు స్వభావం సరిపోతుందో ఓసారి చెక్ చేసుకోండి.
మనలో చాలామంది జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రాలను నమ్ముతారు. ఫాలో అవుతారు. అయితే న్యూమరాలజీ గురించి తెలిసిన వారికి జన్మ సంఖ్య గురించి తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఒక జన్మ సంఖ్య ఉంటుంది. ప్రతి లక్కీ నెంబర్ కి ఒక జంతువు లింక్ అయి ఉంటుందని న్యూమరాలజీ చెబుతోంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం మీరు ఏ జంతువు స్వభావం కలిగి ఉన్నారో తెలుసుకోండి.
జన్మ సంఖ్య ఎలా నిర్ణయించాలి?
ఉదాహరణకి మీ పుట్టినరోజు 18-06-1989 అనుకోండి. ముందుగా ఆ అంకెలను కలపండి. మొత్తం పది కంటే ఎక్కువైతే మళ్లీ కలపాలి. 1+8+0+6+1+9+8+9= 42= 4+2= 6. మీ జన్మ సంఖ్య 6. ఇప్పుడు ఏ జన్మ సంఖ్యకి ఏ జంతువు ఉంటుంది? వాటి స్వభావాలేంటో ఇక్కడ చూద్దాం.
జన్మ సంఖ్య 1- పిల్లి
జన్మసంఖ్య 1 కలిగిన వారు నమ్మకంగా, ప్రేమగా ఉంటారు. పిల్లిలా సిగ్గుపడే స్వభావంతో ఉంటారు. వీరికి ప్రశాంతంగా కూర్చోవడం ఇష్టం. ప్రతి విషయాన్ని పూర్తిగా వివరించాలనుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఫ్యాషన్ ప్రియులు. అందరితో కలిసిపోతారు. కానీ అపరిచితులతో ఎక్కువ మాట్లాడరు. స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా ఉంటారు.
జన్మ సంఖ్య 2- చిరుతపులి
జన్మ సంఖ్య 2 కలిగిన వారు చిరుతలా గోప్యంగా ఉండే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఏ పరిస్థితిని అయినా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రేమ వల్ల గాసిప్స్ కి గురవుతారు. కోరికలు తీరాలని ఆశిస్తారు. కానీ కొన్నిసార్లు విఫలమవుతారు. దానివల్ల సంబంధాలు చెడిపోవచ్చు. కష్టంలో ఉన్నవారికి సాయం చేస్తారు.
జన్మ సంఖ్య 3- కుక్క
పుట్టిన తేదీ ప్రకారం వీరికి కుక్క సంకేత జంతువు. వీరు చాలా విధేయంగా ఉంటారు. పనిలో నిజాయితీపరులు. చాలా సరళంగా, డౌన్ టు ఎర్త్ గా ఉంటారు. దుస్తుల ఎంపికలో మంచి అభిరుచి ఉంటుంది. కొద్దిమంది స్నేహితులే ఉన్నా.. వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు.
జన్మ సంఖ్య 4- సింహం
జన్మ సంఖ్య 4 ఉన్నవారు… సంకేతానికి వ్యతిరేకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు శాంతిని కోరుకుంటారు. గొడవలను దూరం పెడతారు. ఒకే చోట ఎక్కువసేపు ఉండలేరు. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పని చేయించడంలో దిట్ట. ప్రేమించిన వారికోసం ఏమైనా చేస్తారు. మీ మంచితనాన్ని దుర్వినియోగం చేసేవారితో జాగ్రత్తగా ఉండాలి.
జన్మ సంఖ్య 5- కోతి
కోతి మీ జన్మ జంతువు. మీకు కోతిలా తక్కువ ఓపిక. ఎక్కువ ఉద్రేకం. ఏ పనైనా త్వరగా ముగించాలనుకుంటారు. సరళ స్వభావులు. హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. మీది విలక్షణ వ్యక్తిత్వం. అన్ని విషయాల్లోనూ రక్షణాత్మకంగా వ్యవహరిస్తారు. ప్రమాదంలో పడకముందే మీ సిక్త్ సెన్స్ హెచ్చరిస్తుంది.
జన్మ సంఖ్య 6- పావురం
మీరు పావురంలా సంతోషానికి, అదృష్టానికి చిహ్నం. దుఃఖం, సంతోషం రెండింటికీ చలించరు. స్నేహితుల మధ్య నాయకులు. అవసరమైనప్పుడు ఓదార్చడంలో దిట్ట. కపటత్వం ఇష్టపడరు. ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
జన్మ సంఖ్య 7- ఎలుక
మీ జన్మదినం ప్రకారం మీ చిహ్నం ఎలుక. చాలా చురుకుగా ఉంటారు. మీ కళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి. హాస్యప్రియులు. అన్ని వేడుకలకు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. లోపల చాలా సున్నితంగా ఉంటారు. మీతో మాట్లాడాలంటే కొంతమంది చాలాసార్లు ఆలోచిస్తారు.
జన్మ సంఖ్య 8- తాబేలు
తాబేలులా మీరు పరిపూర్ణతకు దగ్గరగా ఉంటారు. మంచి స్వభావం కలిగి ఉంటారు. మీ దయ గురించి స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడూ శాంతిని కోరుకుంటారు. కానీ తప్పు చేసిన వారితో అస్సలు రాజీ పడరు. వెనుక మాట్లాడే చెడు అలవాటు లేదు. అందరితో కలిసిపోయే తత్వం వల్ల మీరంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఉదార స్వభావులు. ప్రతిఫలం ఆశించరు.
జన్మ సంఖ్య 9- పాము
వీరివి ఊహించలేని గుణాలు. ఎప్పుడు దాడి చేస్తారో.. మనసులో విషం ఉందో లేదో చెప్పలేం. ముంగిస లాంటి ప్రత్యర్థులుంటే తప్పా తల దించరు. మిగతావాళ్లు వీరిని చూసి జాగ్రత్త పడతారు. వీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈజీగా బతికేస్తారు.
