Zodiac Signs: చంద్రుడి రాశిమార్పు.. ఆగస్టు 2 వరకు ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనసు, శాంతికి ప్రతీక అయిన చంద్రుడు.. త్వరలో శుక్రునికి సంబంధించిన రాశిలోకి ప్రవేశించనున్నాడు. చంద్రుడి రాశిమార్పు వల్ల కొన్ని రాశులవారికి లాభం కలుగుతుంది. ఆ రాశులేంటో ఓసారి చూసేయండి.
- FB
- TW
- Linkdin
Follow Us

చంద్రుడి రాశిమార్పు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు జూలై 31న తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాశికి అధిపతి శుక్రుడు. డబ్బు, ఆస్తి, సంపదలకు శుక్రుడిని కారకుడిగా భావిస్తారు. చంద్రుడు, శుక్రుని రాశిలో సంచరించడం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. వారి జీవితంలో విజయానికి తలుపులు తెరుచుకుంటాయి. అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మరి ఆ రాశులేంటో చూసేయండి.
తుల రాశి
తుల రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదృష్టం కలిసివస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఉద్యోగంలో మంచి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు ఈ సమయం కలిసివస్తుంది. శుభవార్తలు వింటారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి చంద్ర, శుక్ర గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు. ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. ప్రేమికులు వారి ప్రేమను ఇంట్లో చెప్పడానికి ఇది మంచి సమయం. వ్యాపారంలో లాభాలుంటాయి. కానీ ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారం విస్తరిస్తుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఈ సమయం శుభప్రదం. విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగవచ్చు. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి విజయానికి తలుపులు తెరుచుకుంటాయి.