Saturn Rise: శని ఉదయం.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు, పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయ దేవతగా, కర్మ ఫలదాతగా చెబుతారు. వ్యక్తుల కర్మలను బట్టి వారికి మంచి, చెడు ఫలితాలను ఇస్తుంటాడు శని. త్వరలో శని ఉదయం జరగనుంది. దానివల్ల కొన్ని రాశులవారికి విపరీతంగా కలిసిరానుంది. మరి ఆ అదృష్ట రాశులేవో చూద్దామా..

మీన రాశిలో శని ఉదయం
జ్యోతిష్య శాస్త్రంలో శనిని అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటిగా భావిస్తారు. శని కదలికలలో మార్పులు అన్ని రాశిచక్ర వారిని ప్రభావితం చేస్తాయి. శని ఎప్పటికప్పుడు ఉదయిస్తూ, అస్తమిస్తూ ఉంటాడు. పండితుల ప్రకారం, శని ఏప్రిల్ 17న మీనరాశిలో ఉదయించనున్నాడు. శని ఉదయించినప్పుడు, దాని శక్తి, ప్రభావం రెండూ పెరుగుతాయి. శని ఉదయం 3 రాశులవారికి విపరీతంగా కలిసిరానుంది. వారు పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఏ రాశులవారికి శని అనుగ్రహం కలగనుందో తెలుసుకుందామా…
మకర రాశి
మకర రాశికి అధిపతి శని. కాబట్టి, ఈ రాశి వారికి శని ఉదయం చాలా లాభదాయకంగా ఉంటుంది. కెరీర్‌లో స్థిరత్వం ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. వ్యాపారాలలో కూడా మంచి లాభాలు పొందుతారు. కొత్త ఒప్పందాలు, విదేశీ అవకాశాలు రావచ్చు. ఇంటి వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. తోబుట్టువుల నుంచి మద్ధతు లభిస్తుంది. అయితే, చేపట్టిన పనిలో మరింత కష్టపడాల్సి రావచ్చు. వాదనలు జరిగేటప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి శని ఉదయం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే చాలా బాగుంటుంది. వృషభ రాశిలో ఆదాయ, లాభ స్థానంలో శని ఉదయిస్తాడు. దానివల్ల కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. అయితే, పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వారి సహాయంతో కొన్ని ప్రాజెక్టులు చకచకా పూర్తి చేస్తారు. కోర్టు కేసులలో విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ సమయం కెరీర్, వ్యాపారంలో వృద్ధిని సూచిస్తుంది. శని దేవుడు ఈ రాశివారి కర్మ స్థానంలో చురుకుగా ఉంటాడు. ఉద్యోగ మార్పులు లేదా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల నుంచి లాభాలు కురుస్తాయి. ఈ సమయంలో శని దేవుడి దయ వల్ల ఈ రాశివారికి నిర్ణయం తీసుకునే సామర్థ్యం మరింత పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే ప్రయత్నాలు ఆపకుండా కొనసాగించాలి. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ వేగం పుంజుకుంటాయి.

