Zodiac Signs: శుక్రుడి నక్షత్ర మార్పు.. జూలై 31 వరకు ఈ 3 రాశులకు తిరుగేలేదు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ప్రస్తుతం మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. జూలై 31 వరకు అక్కడే ఉంటాడు. దానివల్ల కొన్ని రాశులవారికి శుభ ఫలితాలున్నాయి. మరి ఆ రాశులేంటో.. అందులో మీ రాశి ఉందో చెక్ చేసుకోండి.
- FB
- TW
- Linkdin
Follow Us

శుక్రుడి సంచారం..
శుక్రుడిని సౌందర్యం, ప్రేమ, ఐశ్వర్యం, సంపదకు కారకుడిగా భావిస్తారు. శుక్రుడి నక్షత్ర మార్పు కొన్ని రాశులవారికి శుభ ఫలితాలనిస్తుంది. శుక్రుడు ప్రస్తుతం మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. జూలై 31 వరకు అక్కడే ఉంటాడు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు(మంగళుడు). అయితే కుజుడి నక్షత్రంలో శుక్రుడి సంచారం.. కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదం. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.
మిథున రాశి
మంగళ నక్షత్రంలో శుక్రుడి సంచారం మిథున రాశి వారికి ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. ఈ సమయం వీరికి చాలా అనుకూలం. ఆస్తి లేదా వ్యాపారంలో పెట్టుబడి పెడితే లాభాలు దక్కవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ గౌరవం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఒంటరి వ్యక్తుల జీవితంలో ప్రత్యేక వ్యక్తి ప్రవేశించవచ్చు.
కర్కాటక రాశి
మంగళ రాశిలో శుక్రుడి సంచారం వల్ల కర్కాటక రాశి వారికి మంచి లాభాలు దక్కుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. శుక్రుని కృప వల్ల జీవితంలో ప్రేమ ఉంటుంది. డబ్బుకు లోటుండదు. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. వృత్తి జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.
తుల రాశి
మంగళ నక్షత్రంలో శుక్రుడి సంచారం తుల రాశి వారికి చాలా అదృష్టం తీసుకువస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. విదేశీ ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. తుల రాశివారికి ఈ సమయం చాలా అనుకూలం.