Lucky Zodiac Signs: వారం రోజులు ఓపిక పడితే.. ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పులు!
జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు.. సమయానుసారం రాశులు, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. త్వరలో శుక్రుడు, గురువు కలిసి మిథునరాశిలో గజలక్ష్మీ రాజయోగాన్ని ఏర్పరచున్నాయి. ఈ యోగం 4 రాశులవారికి మేలు చేయనుంది. మరి ఆ రాశులేంటో.. అందులో మీ రాశి ఉందో చెక్ చేసుకోండి.
- FB
- TW
- Linkdin
Follow Us

గజలక్ష్మీ రాజయోగం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 26న శుక్రుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో ఉన్న గురువుతో కలిసి గజలక్ష్మీ రాజయోగం ఏర్పరుస్తాడు. ఈ రెండు గ్రహాల కలయిక దాదాపు 24 సంవత్సరాల తర్వాత మిథునరాశిలో జరుగుతోంది. గజలక్ష్మీ రాజయోగంలో రాహువు ఐదవ స్థానంలో ఉంటాడు. ఈ రాజయోగం 5 రాశులవారికి శుభప్రదం. మరి ఆ రాశులేంటో చూసేయండి.
మిథున రాశి
శుక్రుడు మిథునరాశిలో సంచరిస్తాడు కాబట్టి.. గజలక్ష్మీ రాజయోగం ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కీర్తిని తెస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తి పొందే అవకాశం ఉంది. చుట్టుపక్కల వారితో సఖ్యతగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఖర్చులు పెరిగినప్పటికీ.. వాటికి తగ్గ ఆదాయం ఉంటుంది. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
తుల రాశి
తుల రాశి వారికి తొమ్మిదవ స్థానంలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వీరికి అదృష్టాన్ని తెస్తుంది. తండ్రి తరపు నుంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రతి ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఏడవ స్థానంలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ఈ సమయంలో వృత్తిపరంగా మంచి విజయాలు సాధించవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు దక్కుతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఐదవ స్థానంలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఈ సమయం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు. ఉద్యోగుల ఆదాయం పెరగవచ్చు.