Today Rasi Phalalu: ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 28.06.2025 శనివారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు
మేష రాశివారికి సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ విలువ పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అంచనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
వృషభ రాశి ఫలాలు
ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో ఇతరులతో వాదనకు వెళ్లకపోవడం మంచిది.
మిథున రాశి ఫలాలు
వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూలం. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి ఫలాలు
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో కొన్ని వ్యవహారాల్లో సఖ్యత లోపిస్తుంది. కుటుంబ విషయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
సింహ రాశి ఫలాలు
ఊహించని ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది.
కన్య రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.
తుల రాశి ఫలాలు
అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. విద్యార్థులకు పోటీ పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
వృశ్చిక రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగంలో చేయని పనికి ఇతరుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాల విషయంలో ఇబ్బందులు ఉంటాయి. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. పాత రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు.
ధనుస్సు రాశి ఫలాలు
బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ పెద్దల నుంచి కొంత ప్రతికూలత ఎదురవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.
మకర రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. స్థిరాస్తి వివాదాలను సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు మరింత అభివృద్ధి బాటలో సాగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభ రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు సన్నిహితుల సహకారంతో ఉద్యోగం వస్తుంది.
మీన రాశి ఫలాలు
కొన్ని వ్యవహారాల్లో ఇతరుల నుంచి సమస్యలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో వాదనలకు వెళ్లకపోవడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.