Today Rasi Phalalu: ఈ రాశివారు డబ్బు విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తప్పవు!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 25.06.2025 బుధవారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు
మేష రాశి వారికి సోదరులతో దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఈ రాశివారు ఆస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి విషయాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
వృషభ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి.
మిథున రాశి ఫలాలు
మిథున రాశివారికి నేడు(బుధవారం) పెద్దగా కలిసిరాదు. ఈ రాశివారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. విశ్రాంతి లభించదు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
కర్కాటక రాశివారికి కీలక వ్యవహారాల్లో ఆప్తులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కానీ ఫలితం పెద్దగా ఉండదు. నిరుద్యోగులకు ప్రయత్న లోపం వల్ల వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ఈ రాశివారు డబ్బు వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
సింహ రాశి ఫలాలు
సింహ రాశివారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మిత్రులతో చర్చలు జరుపుతారు. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాల్లో కొన్ని సమస్యల నుంచి బయట పడతారు.
కన్య రాశి ఫలాలు
కన్య రాశివారికి ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
తుల రాశి ఫలాలు
తుల రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు. పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో ధన నష్టాలు ఉంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది.
వృశ్చిక రాశి ఫలాలు
వృశ్చిక రాశివారికి కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో విఫలం అవుతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు కలుగుతాయి. విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ధనుస్సు రాశి ఫలాలు
ధనుస్సు రాశివారికి సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో తెలివిగా వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది.
మకర రాశి ఫలాలు
మకర రాశివారికి కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు అంతగా కలసిరావు.
కుంభ రాశి ఫలాలు
కుంభ రాశివారు ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని పాత సంఘటనలను గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లోకి అవసరమైన కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.
మీన రాశి ఫలాలు
మీన రాశివారు వ్యాపారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం ఉండదు. పిల్లల చదువు సంబంధిత విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి.