Today Rasi Phalalu: ఈ రాశుల వారికి కొత్త పరిచయాలతో లాభాలు.. మిత్రులతో కలహాలు!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 23.07.2025 బుధవారానికి సంబంధించినవి.
- FB
- TW
- Linkdin
Follow Us

మేష రాశి ఫలాలు
వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు వస్తాయి. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉంది. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు.
మిథున రాశి ఫలాలు
కొత్తగా అప్పులు చేస్తారు. బంధు మిత్రులతో కొన్ని వ్యవహారాల్లో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు తెప్పిస్తాయి. కొన్ని పనులు మధ్యలో ఆగిపోతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
కర్కాటక రాశి ఫలాలు
ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా అనుకూలం. చేపట్టిన పనుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
సింహ రాశి ఫలాలు
కొత్త పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
కన్య రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులు వల్ల రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. మిత్రులతో కొన్ని వ్యవహారాల్లో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కుటుంబ విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
తుల రాశి ఫలాలు
వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధు మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు చికాకు తెప్పిస్తాయి. అనారోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికమవుతుంది.
వృశ్చిక రాశి ఫలాలు
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల రాక ఆనందం కలిగిస్తుంది.
ధనుస్సు రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మకర రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి.
కుంభ రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తికావు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు.
మీన రాశి ఫలాలు
విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూ వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో అంచనాలను అందుకుంటారు.