Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్.. నిరుద్యోగులకు ఉద్యోగం!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 18.06.2025 బుధవారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు
బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాల్లో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులకు పనిభారం అధికమవుతుంది.
వృషభ రాశి ఫలాలు
ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఉద్యోగులకు నూతన బాధ్యతల వల్ల చికాకు పెరుగుతుంది. పిల్లల చదువు విషయాలపై దృష్టి సారించడం మంచిది.
మిథున రాశి ఫలాలు
వ్యాపారాలు విస్తరించి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగుల పని ఒత్తిడి నుంచి బయటపడతారు.
కర్కాటక రాశి ఫలాలు
ఒక విషయంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. దూర ప్రయాణాల్లో అవరోధాలు కలుగుతాయి.
సింహ రాశి ఫలాలు
సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది.
కన్య రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు.
తుల రాశి ఫలాలు
దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపారపరంగా లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహన యోగం ఉంది. ఆర్థిక వ్యవహారాలు కలిసివస్తాయి.
ధనుస్సు రాశి ఫలాలు
చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు అధికారులతో చర్చలు కలిసిరావు.
మకర రాశి ఫలాలు
ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో నిరాశ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది.
కుంభ రాశి ఫలాలు
విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.
మీన రాశి ఫలాలు
సోదరుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.