Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు రాత్రికి రాత్రే ధనవంతులవుతారు!
ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు. అందుకోసం కష్టపడతారు. కొందరికి విజయం లేటుగా దక్కితే.. మరికొందరు తొందరగా డబ్బు, కీర్తి పొందవచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్నితేదీల్లో పుట్టినవారు రాత్రికి రాత్రే కోటిశ్వరులవుతారట. ఆ తేదీలేంటో చూద్దాం.

సంఖ్యా శాస్త్రం ప్రకారం...
బాగా డబ్బు సంపాదించాలి, లగ్జరీగా బ్రతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం పగలు, రాత్రి కష్టపడతారు. అయితే కొందరికీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోవచ్చు. వారు ధనవంతులు కావడానికి చాలా టైం పట్టవచ్చు. కానీ కొందరికి కష్టంతోపాటు అదృష్టం తోడై తొందరగా ధనవంతులు కావచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వారు చిన్నవయసులోనే ధనవంతులు అవుతారు. మరి ఆ తేదీలేంటో అందులో మీ బర్త్ డేట్ ఉందో ఒకసారి చెక్ చేస్కోండి.
ఏ తేదీల్లో పుట్టిన వారు ధనవంతులవుతారు?
సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వారు చాలా డబ్బు, కీర్తిని పొందుతారు. ఏ నెలలో అయినా 4, 13, 22 లేదా 31 తేదీల్లో జన్మించిన వారి మూలసంఖ్య 4. మూలసంఖ్య 4 కలిగిన వ్యక్తులు మంచి ఆశయం కలిగినవారు. వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టినవారు దేన్ని అంత సులభంగా పొందలేరు. విజయం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ కచ్చితంగా ప్రతిఫలం పొందుతారు.
30 సంవత్సరాల తర్వాత
4వ సంఖ్యకు అధిపతి రాహువు. ఈ వ్యక్తుల అదృష్టం రాహువు ప్రభావంతో రాత్రికి రాత్రే ప్రకాశిస్తుంది. రాహువు వీరి జీవితంలో చాలా ఎత్తుపల్లాలను తెస్తాడు. కాబట్టి 4వ సంఖ్య ఉన్నవారు 30 సంవత్సరాల దీర్ఘకాలం వేచి ఉన్న తర్వాత జీవితంలో విజయం పొందుతారు. రాహువు ప్రభావంతో వీరు రాత్రికి రాత్రే కోటిశ్వరలవుతారు.
వీరి స్వభావం ఎలా ఉంటుందంటే?
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూలసంఖ్య 4 కలిగిన వ్యక్తులు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా భయపడరు. ప్రతి కష్టాన్ని.. చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. రాహువు ప్రభావం వల్ల వీరికి చాలా ఓపిక, ధైర్యం ఉంటాయి. ఈ గుణాలే వారికి విజయాన్నితెచ్చిపెడతాయి.