- Home
- Astrology
- Today Rasi Phalalu: ఈ రాశుల వారికి అప్పుల నుంచి విముక్తి.. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి!
Today Rasi Phalalu: ఈ రాశుల వారికి అప్పుల నుంచి విముక్తి.. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 16.06.2025 సోమవారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు
పెద్దల అనుగ్రహంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.
వృషభ రాశి ఫలాలు
ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కీలక విషయాల్లో అలోచించి ముందుకు సాగాలి.
మిథున రాశి ఫలాలు
తల్లి తరపు బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్ట సూచనలు ఉన్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
కర్కాటక రాశి ఫలాలు
బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. వృత్తి, ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.
సింహ రాశి ఫలాలు
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేరు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కంటి సంబంధిత సమస్యలు బాధిస్తాయి.
కన్య రాశి ఫలాలు
నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అప్పులు తీరుస్తారు. ప్రశాంతంగా ఉంటారు.
తుల రాశి ఫలాలు
ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పై అధికారులతో ఊహించని సమస్యలు వస్తాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.
వృశ్చిక రాశి ఫలాలు
ఆర్థికంగా అనుకూలం. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
దైవ కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో విందు వినోదాదాల్లో పాల్గొంటారు.
మకర రాశి ఫలాలు
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇతరులతో అలోచించి మాట్లాడటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.
కుంభ రాశి ఫలాలు
దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. బంధు మిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు వస్తాయి. ఉద్యోగంలో తోటివారితో మాటపట్టింపులు కలుగుతాయి.
మీన రాశి ఫలాలు
చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుంచి బయట పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారం విషయంలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటారు.