Today Rasi Phalalu: ఈ రాశి వారికి అన్నదమ్ములతో ఆస్తి గొడవలు తప్పవు!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 12.06.2025 గురువారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు
ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి ఫలాలు
భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. పిల్లల చదువు విషయాలపై దృష్టి సారించడం మంచిది.
మిథున రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార, ఉద్యోగాల్లో సొంత నిర్ణయాలు కలిసివస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒక విషయంలో మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహ రాశి ఫలాలు
ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా లాభాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కన్య రాశి ఫలాలు
అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలు ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
తుల రాశి ఫలాలు
సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. నిరుద్యోగులకు కలిసివస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలం. ఆదాయం బాగుంటుంది.
వృశ్చిక రాశి ఫలాలు
దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు వ్యవహారాలు కలిసివస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పాత మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది.
మకర రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలు అంతగా కలిసిరావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం అందిస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
కుంభ రాశి ఫలాలు
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సోదరుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది.
మీన రాశి ఫలాలు
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాజకీయవర్గాల వారికి పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.