సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినతేదీ, సమయం కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని తేదీల్లో పుట్టినవారికి పెళ్లి తర్వాత అదృష్టం కలిసివస్తుందట. మరి ఆ తేదీలేంటో అందులో మీ బర్త్ డేట్ ఉందో ఓసారి చెక్ చేసుకోండి. 

సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల భవిష్యత్ గురించి తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. పెళ్లి తర్వాత వీరి జీవితం చాలా బాగుంటుందట. పెళ్లితో వీరి అదృష్టం ఒక్కసారిగా మారిపోతుందట. మరి ఏ తేదీల్లో పుట్టినవారికి పెళ్లి కలిసివస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. 

మూలసంఖ్య 7  

ఏ నెలలో అయినా 7, 16 లేదా 25వ తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 7. ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య. కేతు గ్రహ ప్రభావం ఈ తేదీల్లో పుట్టినవారిపై ఉంటుంది. వీరు బాగా కష్టపడతారు. కష్టానికి అదృష్టం తోడై ఉన్నతంగా ఎదుగుతారు. 

వీరి స్వభావం ఎలా ఉంటుందంటే?

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టినవారు కేతువు ప్రభావంతో చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఏ విషయాన్నిఅయినా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఇతరుల కోణం నుంచి కూడా ఆలోచించడం వీరి ప్రత్యేకత. ఈ తేదీల్లో పుట్టినవారికి అంతరదృష్టి ఉంటుంది. ఎప్పుడూ ఆత్మపరిశీలన చేసుకుంటారు. ఆధ్యాత్మికంగా ఉంటారు. వీరి అదృష్టం బాగుంటుంది. పెళ్లి తర్వాత వీరి అదృష్టం మరింత పెరుగుతుంది. 

పెళ్లి తర్వాత అదృష్టం

న్యూమరాలజీ ప్రకారం ఈ 3 తేదీల్లో పుట్టినవారు ప్రేమను బహిరంగంగా ప్రదర్శించరు. కానీ వారి హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించినవారు జీవిత భాగస్వామిని చాలా ప్రేమిస్తారు. వారి ఆలోచనలను గౌరవిస్తారు. పెళ్లయ్యాక వీరు వృత్తిపరంగా అపారమైన ప్రగతి సాధిస్తారు. మూలసంఖ్య 7 కలిగిన వ్యక్తులు 2, 5, 9 మూలసంఖ్యలు కలిగిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.  

ధైర్యవంతులు

మూలసంఖ్య 7 కలిగిన వ్యక్తులు చాలా ధైర్యవంతులు. ఏ పరిస్థితికీ భయపడరు. ఎలాంటి కష్టాన్నిఅయినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వారి తెలివితేటలతో, ఆలోచనా విధానంతో అందరిని ఆకట్టుకుంటారు. కేతువు వీరిని ఆధ్యాత్మికులుగా చేస్తుంది. దానధర్మాలకు వీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. బుద్ధిమంతులతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు.