Birth Dates: ఈ తేదీల్లో పుట్టినవారు శివుడి అనుగ్రహంతో ఏదైనా సాధిస్తారు!
సంఖ్యా శాస్త్రంలో మూలసంఖ్యలకు ప్రత్యేక స్థానం ఉంది. 1 నుంచి 9 వరకు మూలసంఖ్యల్లో మహా దేవుడికి ఇష్టమైన 3 సంఖ్యలు ఉన్నాయి. ఈ మూలసంఖ్య కలిగిన వ్యక్తులు శివుని అనుగ్రహం పొందుతారట. మరి ఆ సంఖ్యలేంటో ఓసారి చూసేయండి.

శివునికి ఇష్టమైన మూలసంఖ్య
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి మూలసంఖ్య వారి పుట్టినతేదీ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ మూలసంఖ్య ద్వారా వారి జీవితం, భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. మూలసంఖ్యలు 1 నుంచి 9 వరకు ఉంటాయి. వాటిలో మూడు మూలసంఖ్యలంటే శివునికి చాలా ఇష్టమట. అవేంటో చూసేయండి.
శివుడి ప్రత్యేక అనుగ్రహం
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య 5. ఇది బుధ గ్రహానికి సంబంధించింది. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా తెలివైనవారు. మంచి వక్తలు. వారి మాటతీరుతో ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారిపై శివుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. మహాదేవుడి కృపతో వీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు.
శివునికి ఇష్టమైన మూలసంఖ్య
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య 7. ఇది కేతువుకు సంబంధించింది. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఆధ్యాత్మిక, రహస్య, ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. సహజంగానే వీరికి శివునిపై భక్తి ఉంటుంది. శివుడు కూడా ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ రక్షణగా ఉంటాడు.
శివుడంటే అపారమైన భక్తి
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య 9. ఇది కుజ గ్రహానికి సంబంధించింది. ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు సాహసోపేతమైన, పోరాట స్వభావం కలిగి ఉంటారు. కష్టపడేతత్వం ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడానికి వీరు ముందుంటారు. సహజంగానే వీరికి శివుడంటే అపారమైన భక్తి ఉంటుంది. వీరిపై మహాదేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.