MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Garuda Puranam: ఇలాంటి మనుషులు వచ్చే జన్మలో రాబందులుగా పుడతారట

Garuda Puranam: ఇలాంటి మనుషులు వచ్చే జన్మలో రాబందులుగా పుడతారట

Garuda Puranam: గరుడ పురాణం హిందూ ధర్మంలో ముఖ్యమైనది. ఇది జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం, పాపపుణ్యాల గురించి వివరించినది. ఇందులో పునర్జన్మ వంటి అంశాలు ఉన్నాయి. కొన్ని పనులు చేయడం వల్ల వచ్చే జన్మలో మనుషులు ఎలాంటి జన్మ పొందుతారో గరుడ పురాణం చెబుతోంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jan 11 2026, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గరుడు పురాణం ఏం చెబుతోంది?
Image Credit : AI Generated

గరుడు పురాణం ఏం చెబుతోంది?

గరుడ పురాణం హిందూ ధర్మంలోని ప్రముఖ గ్రంథం ఇది. ఒక మనిషి పాప పుణ్యాలను, మరణానంతర జీవితాన్ని, ఆత్మ ప్రయాణాన్ని, పాప కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ వంటి అంశాలను వివరిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మనిషి ఈ జన్మలో చేసే ప్రతి పని కూడా అతని తరువాతే జన్మపై ప్రభావం చూపిస్తుందని అంటుంది. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే కఠినమైన ఫలితాలు తప్పవని గరుడ పురాణం స్పష్టంగా చెబుతోంది. గరుడ పురాణం అనేది కేవలం మరణానంతరం విషయాల గురించి తెలుసుకునే గ్రంథం మాత్రమే కాదు.. జీవించి ఉన్నప్పుడే మన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా నేర్పించే ఒక నైతిక గ్రంథంగా చెప్పుకోవాలి.

24
ఈ పాపాలు చేస్తే రాబందు పుట్టుకే
Image Credit : AI Generated

ఈ పాపాలు చేస్తే రాబందు పుట్టుకే

గరుడ పురాణంలో కొన్ని రకాల పాపాల గురించి చెబుతారు. అలాంటి పాపపు పనులు చేస్తే వచ్చే జన్మలో నీచమైన రూపంలో పుట్టక తప్పదని గరుడ పురాణం చెబుతోంది. ముఖ్యంగా ఇతరులను మోసం చేసేవారు, నమ్మించి ద్రోహం చేసేవారు, అతి స్వార్థంతో జీవించేవారు, తమకన్నా బలహీనులను హింసించేవారు, అత్యంత పాపాత్ములుగా గరుడ పురాణం లెక్కిస్తుంది. వాటిని తీవ్రమైన పాపాలుగానే చెబుతోంది. ఈ పాపాలు చేసే వారికి ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా విముక్తి ఉండదు. ఈ రెండు జన్మల్లోనూ కష్టాలు పడక తప్పదని గరుడ పురాణం హెచ్చరిస్తోంది. ఇలాంటి పాపాలు చేసేవారు వచ్చే జన్మలో రాబందుగా పుట్టే అవకాశం ఉందని అంటుంది గరుడ పురాణం. రాబందులు మృతదేహాలపై ఆధారపడి జీవించే పక్షులు ఇంతకంటే నీచ జనమైన జన్మ ఇంకొకటి ఉండదు.

Related Articles

Related image1
Shambhala Nagaram: శంభాల నగరం మనదేశంలో ఎక్కడుంది? దీనికెందుకంత ప్రాధాన్యం?
Related image2
Chhatrapati Shivaji Death: ఛత్రపతి శివాజీ ఎలా మరణించారు? రెండో భార్య హత్య చేసిందా?
34
ఇలాంటి పనులు చేయకూడదు
Image Credit : AI Generated

ఇలాంటి పనులు చేయకూడదు

గరుడ పురాణం చెబుతున్న ప్రకారం స్నేహితులను మోసం చేసిన వారు ఎప్పటికీ బాగుపడరు. ఇతరుల సంపదను శ్రమను దోచుకున్న వారు కర్మ ఫలితాలను కచ్చితంగా అనుభవిస్తారు. అలాంటివారు చాలా నీచమైన జంతువులుగా పునర్జన్మను పొందుతారని గరుడ పురాణం చెబుతోంది. వచ్చే జన్మలో కూడా గౌరవం లేని, స్వతంత్రత లేని, అసహ్యకరమైన జన్మలో జీవించాల్సి రావచ్చు. ఈ జన్మలో మీరు చేసే పుణ్యాలు వచ్చే జన్మకు మీకు మంచి జీవితాన్ని అందిస్తాయి. సంఘంలో గౌరవాన్ని అందించే స్థాయిలో పుట్టుకను ఇస్తాయి. అందుకే జీవితంలో నైతికంగా, ధర్మబద్ధంగా నడుచుకోవాలని గరుడ పురాణం చెబుతోంది.

44
మూఢ నమ్మకాలేనా?
Image Credit : AI Generated

మూఢ నమ్మకాలేనా?

ఆధునిక కాలంలో ఇలాంటి విషయాలను మూఢనమ్మకాలుగా కొట్టి పడేస్తారు. వచ్చే జన్మలో రాబందుగా పుట్టడం అనేది మీకు మూఢనమ్మకం కావచ్చు. కానీ స్నేహితులని మోసం చేయడం, ఇతరులను బాధ పెట్టడం వంటివన్నీ కూడా చెడు పనులే. అలా ఇది నైతిక బోధనను చేస్తోందని అర్థం చేసుకుంటే మంచిది. గరుడ పురాణం చెప్పే సందేశం ఏమిటంటే మనిషి తన స్వార్థం కోసం ఇతరులకు హాని చేయకూడదు. నిజాయితీగా జీవించాలి. ఇతరుల పట్ల దయ, కరుణా వంటివి ఉండాలి. అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. మన ప్రవర్తనే మన జీవితాన్ని దిగజారేలా చేస్తుంది? గరుడ పురాణం చదివి మీరు భయపడే కన్నా దాని నుంచి మంచి జీవితం ఎలా గడపాలో నేర్చుకుంటే ఉత్తమం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు నెమలి ఈక తో అదృష్టాన్ని పెంచుకోవచ్చు
Recommended image2
Rahu Planet: రాహువు ఈ రాశుల వారిని ఎల్లప్పుడూ కాపాడతాడు, డబ్బుకు లోటు రానివ్వడు
Recommended image3
Ketu Transit: కేతువు నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Related Stories
Recommended image1
Shambhala Nagaram: శంభాల నగరం మనదేశంలో ఎక్కడుంది? దీనికెందుకంత ప్రాధాన్యం?
Recommended image2
Chhatrapati Shivaji Death: ఛత్రపతి శివాజీ ఎలా మరణించారు? రెండో భార్య హత్య చేసిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved