MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope: ఈ వారం 4 రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది.. మీ రాశి ఉందా?!

Weekly Horoscope: ఈ వారం 4 రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది.. మీ రాశి ఉందా?!

Weekly Horoscope: ఈ వార ఫలాలు 15.3.2026 నుంచి 21.3.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

3 Min read
Author : Kavitha G
Published : Mar 15 2026, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : Getty

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఈ వారం మేష రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా, చక్కగా పూర్చిచేసి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. వృథా ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. పెద్దల సలహాలు కలిసివస్తాయి.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. త్వరగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు!
Related image2
Dream Astrology: స్వప్న శాస్త్రం ప్రకారం ఏ రోజు వచ్చిన కల ఎక్కువగా నిజం అవుతుందో తెలుసా?
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఈ వారం వృషభ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు ఉంటాయి. కృషికి తగిన ఫలితాలు దక్కుతాయి. ఆర్థికంగా కొంత స్థిరత్వం ఉంటుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

మిథున రాశివారికి ఈ వారం పనుల ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మీ తెలివితేటలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు సమస్యలను అధిగమించడంలో సహాయపడతాయి. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనులను సరైన టైంకి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశివారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారులకు కొత్త పరిచయాలు లాభదాయకంగా మారుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యం అంతగా సహకరించదు. ఈ వారం కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి ఈ వారం ఉత్సాహంగా సాగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఆర్థికంగా మంచి అవకాశాలు కనిపించవచ్చు. పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య చక్కగా సహకరిస్తుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం మంచిది. బంధువులతో బంధాలు మరింత బలపడతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశివారికి ఈ వారం పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

తుల రాశివారు ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో పనులు కొంత ఆలస్యం కావచ్చు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబంలో వివాదాలు వస్తాయి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన అవసరం. ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మీ ప్రతిభను చూపించే అవకాశాలు వస్తాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.స్నేహితులతో కలిసి సమయం గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కోపాన్ని నియంత్రించుకోవడం అవసరం. ఆలోచించి మాట్లాడితే అనవసర సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి ఈ వారం కొత్త అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు లేదా పదోన్నతిపై చర్చలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలలో కొత్త ప్రణాళికలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఈ వారం మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం మీకు విజయాన్ని అందించే సూచనలు ఉన్నాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మకర రాశివారికి ఈ వారం బిజీ బిజీగా గడిచే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా, మంచి గుర్తింపు పొందుతారు. వ్యాపారాలలో స్థిరమైన పురోగతి ఉంటుంది. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబంలో కొంత ఒత్తిడి వాతావరణం ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు ప్రణాళికలకు దారితీసే అవకాశం ఉంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారికి ఈ వారం కొంత ఉత్సాహంగా గడిచే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడుపుతారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. మీ క్రియేటివిటీతో ఈ వారం మంచి అవకాశాలు పొందుతారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మీన రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కృషికి తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారులకు లాభాలు క్రమంగా పెరుగుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రశాంతత పొందుతారు. ఈ వారం మీరు చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Power: ఈ 2 రాశుల వారికి గురుబలంతో భారీ ఆదాయం వచ్చే అవకాశం
Recommended image2
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం, 392 కిలోమీట‌ర్ల‌లో కొత్త రైల్వే లైన్‌.. ఈ ప్రాంతాల్లో భూమ‌ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు
Recommended image3
Zodiac sign: ఈ రాశికి ఈ వారం ల‌క్కే ల‌క్కు.. కానీ ఒక్క విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. త్వరగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు!
Recommended image2
Dream Astrology: స్వప్న శాస్త్రం ప్రకారం ఏ రోజు వచ్చిన కల ఎక్కువగా నిజం అవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved