Guru Shukra Conjunction: గురు శుక్రుల కలయిక ఈ 4 రాశులకు డబ్బే డబ్బు, కొత్త జాబ్ కూడా
Guru Shukra Conjunction: 2026 మార్చి 18న గురు, శుక్ర గ్రహాల కలయిక జరగబోతోంది. దీని ద్రిష్టి యోగం ఏర్పడుతోంది.ఈ యోగం 4 రాశుల వారికి ధనలాభం, ఉద్యోగావకాశాలను అందిస్తుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకోండి.

గురు శుక్రుల బలమైన కలయిక
జ్యోతిషంలో గురు గ్రహం, శుక్ర గ్రహం.. ఈ రెండూ కూడా ముఖ్యమైన గ్రహాలు. ఇందులో గురు గ్రహం అభివృద్ధి, జ్ఞానం, అదృష్టానికి సంకేతం. ఇక శుక్రుడు సంపద, సౌకర్యాలను అందిస్తాడు. ఈ రెండు గ్రహాలు ఒకేసారి మంచి స్థానంలో కలిస్తే కొన్ని రాశుల వారికి భారీగా కలిసి వస్తుంది. ఇప్పుడు గురు శుక్రుల కలయిక వల్ల ద్రిష్టి యోగం ఏర్పడుతుంది. దాని ప్రభావం నాలుగు రాశుల వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ ద్రిష్టి యోగం ఎంతో మంచి మార్పులను జీవితంలో తీసుకువస్తుంది. ఈ రాశి వారి కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. వారి జీవితంలో సమస్యలు తగ్గి, భాగస్వామితో మంచి అవగాహనతో జీవిస్తారు. ఈ రాశి వారు ఉద్యోగం, వ్యాపారంలో మంచి పరిస్థితులు ఏర్పడతాయి. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అవి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి.
తులా రాశి
తులా రాశి (Libra) వారికి కూడా గురు శుక్ర గ్రహాల కలయిక ఎంతో అనుకూలమైన ఫలితాలు అందిస్తుంది. ఉంటుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ ద్రిష్టి యోగం ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారి వైవాహిక జీవితం, సంబంధాలు మరింత బలపడతాయి. వృత్తిపరంగా కొత్త అవకాశాలు లభించవచ్చు. ధన ప్రవాహం నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంది.
మీన, ధనూ రాశి
ఇక ధనుస్సు (Sagittarius), మీన (Pisces) రాశుల వారికి కూడా ఈ కాలంలో మంచి జరుగుతుంది. ఈ రెండు రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు ఏర్పడుతాయి. ఈ రెండు రాశుల వారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపుతారు. ఈ రెండు రాశులకు డబ్బుల పరంగా మంచి అవకాశాలు లభించవచ్చు. ఏ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి అడుగు వేయాలి.

