MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Chhatrapati Shivaji Death: ఛత్రపతి శివాజీ ఎలా మరణించారు? రెండో భార్య హత్య చేసిందా?

Chhatrapati Shivaji Death: ఛత్రపతి శివాజీ ఎలా మరణించారు? రెండో భార్య హత్య చేసిందా?

Chhatrapati Shivaji Death: ఛత్రపతి శివాజీకి భారత చరిత్రలో గౌరవనీయులైన స్థానం ఉంది. స్వరాజ్య స్థాపన కోసం ఆయన చేసిన పోరాటం ఇప్పటికీ ఆదర్శమే. అలాంటి మహానుభావుడి మరణంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వాటిలో రెండో భార్య హత్య చేసిందనేది కూడా ఒకటి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jan 02 2026, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చరిత్రలో ఛత్రపతి శివాజీ
Image Credit : AI Generated

చరిత్రలో ఛత్రపతి శివాజీ

భారతదేశ స్వాతంత్రోద్యమకారుల్లో ఛత్రపతి శివాజీ పేరు వినిపిస్తుంది. పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు ఆయన. అయితే అతని మరణం పై ఇప్పటికీ ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అతడు అనారోగ్యంతో మరణించాడని చరిత్ర చెబుతుంటే... అధికారం కోసం రెండో భార్య హత్య చేసిందనే వాదన కూడా ఉంది. అసలు శివాజీ ఎలా మరణించారు? అతని మరణంలో రెండో భార్య పాత్ర ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

23
శివాజీ రెండో భార్య ఎవరు?
Image Credit : AI Generated

శివాజీ రెండో భార్య ఎవరు?

ఛత్రపతి శివాజీ 1630వ సంవత్సరంలో ఫిబ్రవరి 19న పూణే జిల్లాలోని జున్నార్ పట్టణంలో ఉన్న శివనేరి కోటలో జన్మించారు. వీరంతా వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. శివాజీకి ముందు పుట్టిన బిడ్డలందరూ చనిపోయారు. దాంతో శివాజీ తల్లి జిజియా బాయి శివై పార్వతి అనే దేవతను పూజించింది. ఆమె పేరుని శివాజీకి పెట్టింది. శివాజీ తన తండ్రి పొందిన పరాజయాలను అధ్యయనం చేసి తక్కువ కాలంలోనే యుద్ద తంత్రాలలో ఆరితేరిపోయాడు. సకల విద్యలు నేర్చుకున్నాడు. మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 

17 ఏళ్ల వయసులోనే తొలిసారిగా యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన కోటను సొంతం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి అతని విజయ ప్రస్థానం సాగుతూనే వచ్చింది. శివాజీ జీవితంలో యుద్ధాలే ఎక్కువ పాత్ర పోషించాయి. శివాజీ మొదటి భార్య పేరు సాయి బాయి. అయితే మొదటి భార్య అనారోగ్య కారణాలవల్ల మరణించారు. ఆ తర్వాత శివాజీ మరింత మందిని పెళ్లి చేసుకున్నారు. వారిలో ఒకరు సోయరా భాయి. ఆమెను రెండో భార్యగా చెప్పుకుంటారు.

Related Articles

Related image1
Shambhala Nagaram: శంభాల నగరం మనదేశంలో ఎక్కడుంది? దీనికెందుకంత ప్రాధాన్యం?
Related image2
Sri Krishnadevaraya: శ్రీ కృష్ణదేవరాయలు తన మంత్రి తిమ్మరుసు కళ్లు ఎందుకు పీకించాడు? అతను ఏం తప్పు చేశాడు?
33
శివాజీని చంపేశారా?
Image Credit : AI Generated

శివాజీని చంపేశారా?

1680లో శివాజీ అకస్మాత్తుగా మరణించారు. తీవ్రమైన జ్వరం, విరేచనాలు, శరీరం బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపించాయని చారిత్రకకారులు చెబుతూ ఉంటారు. ఇలాంటి వ్యాధులు అప్పట్లో ప్రాణాంతకంగా మారేవి. ఎందుకంటే వైద్య సదుపాయాలు చాలా తక్కువగా ఉండే కాలం అది. అందువల్ల ఎక్కువ మంది చారిత్రకారులు శివాజీది సహజ మరణమేనని భావించారు. 

అయితే కొందరు మాత్రం శివాజీని రెండో భార్య సోయిరా బాయి విషం పెట్టి చంపిందనే ప్రచారం ఉంది. అయితే ఈ వాదనకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. రాజ శాసనాలు, విదేశీ ప్రయాణికుల రచనల్లో కూడా ఈ ఆరోపణ ఎక్కడా నిర్ధారణ జరగలేదు. కేవలం నోటి మాటల ద్వారానే ఇంతవరకు ఆ కథ ప్రచారంలోకి వచ్చింది. దీనికి కారణం కూడా శివాజీ మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాలుగా చెప్పుకుంటారు. 

శివాజీకి పెద్ద కొడుకు శంభాజీ ఉన్నాడు. అయితే సోయిరాబాయి తనకు పుట్టిన కొడుకు రాజారామ్ నే రాజుగా చేయాలని ప్రయత్నించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ వారసత్వ పోరాటమే అంతర్గత కలహాలకు కారణమయ్యింది. అదే సోయరా బాయి శివాజీని చంపిందని అనుమానాలు పెరగడానికి కూడా కారణమయ్యాయి. ఇదే తప్ప ఛత్రపతి శివాజీది ఆరోగ్యపరమైన కారణాల వల్ల సంభవించిన మరణమే... కానీ రెండో భార్య హత్య చేశారన్నది విషయంలో ఎలాంటి నిజం లేదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railways : ఇప్పటివరకు రైలు పరుగుతీయని రాష్ట్రమేదో తెలుసా?
Recommended image2
Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Recommended image3
Walking Palm: ప్రపంచంలోనే నడిచే చెట్టు ఇదొక్కటే.. ఎలా నడుస్తుంది?
Related Stories
Recommended image1
Shambhala Nagaram: శంభాల నగరం మనదేశంలో ఎక్కడుంది? దీనికెందుకంత ప్రాధాన్యం?
Recommended image2
Sri Krishnadevaraya: శ్రీ కృష్ణదేవరాయలు తన మంత్రి తిమ్మరుసు కళ్లు ఎందుకు పీకించాడు? అతను ఏం తప్పు చేశాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved