MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Sun Mercury Jupiter Conjunction: బ్రహ్మాదిత్య యోగం.. ఈ 3 రాశులకు ఊహకందని లాభాలు!

Sun Mercury Jupiter Conjunction: బ్రహ్మాదిత్య యోగం.. ఈ 3 రాశులకు ఊహకందని లాభాలు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వల్ల రాజయోగాలు ఏర్పడుతుంటాయి. జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రాశిలో ఉన్న బుధుడు, గురువులతో కలిసి శక్తివంతమైన యోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ యోగం వల్ల ఏ రాశివారికి లాభం కలుగుతుందో ఇక్కడ చూద్దాం.  

2 Min read
Kavitha G
Published : Jun 14 2025, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బ్రహ్మాదిత్య యోగం
Image Credit : our own

బ్రహ్మాదిత్య యోగం

జూన్ 15న సూర్యుడు వృషభ రాశిని విడిచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు, గురువు ఇప్పటికే ఆ రాశిలో ఉన్నారు. మిథున రాశిలోకి సూర్యుని ప్రవేశం సూర్య, బుధ, గురువుల త్రిగ్రహ యోగాన్ని సృష్టిస్తుంది. జ్యోతిష్యంలో ఈ యోగాన్ని బ్రహ్మ ఆదిత్య యోగం అంటారు. ఈ యోగాన్ని చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.

24
మిథున రాశివారిపై త్రిగ్రహ యోగ ప్రభావం
Image Credit : Asianet News

మిథున రాశివారిపై త్రిగ్రహ యోగ ప్రభావం

మిథున రాశి వారికి సూర్య, గురు, బుధ గ్రహాల త్రిగ్రహ యోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. దీని ప్రభావంతో వివిధ రంగాలవారికి మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ కెరీర్‌లో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగంలో సడెన్ గా ప్రమోషన్ రావచ్చు. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు వస్తాయి. ఈ రాశి వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. కళాత్మక, సృజనాత్మక సామర్థ్యాల కారణంగా సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు రాత్రికి రాత్రే ధనవంతులవుతారు!
Related image2
Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టినవారు ఏ ఉద్యోగం సరిగ్గా చేయరు..!
34
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

సింహ రాశి వారు ఈ యోగం వల్ల తమ జీవితంలో మంచి ఫలితాలను చూడవచ్చు. గురువు మీ జ్ఞానాన్ని పెంచుతాడు. సూర్యుడు మీకు ఆలోచనా శక్తిని ఇస్తాడు. ఈ సమయంలో మీరు మీ శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు.  మీ ప్రత్యర్థులకు సరైన సమాధానం చెప్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ కెరీర్‌లో పురోగతి సాధించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు.

44
ధనుస్సు రాశి
Image Credit : Asianet News

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి త్రిగ్రహ యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ యోగం వల్ల మీ జీవితంలో పురోగతి ఉంటుంది. ఈ యోగం మీకు అనేక విషయాల్లో విజయాన్ని అందిస్తుంది. ఈ రాశి వారి కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. రచన, గానం లేదా సంగీత రంగాల్లో మీకు మంచి పేరు రావచ్చు. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఈ రాశివారు మంచి వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved