Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టినవారు ఏ ఉద్యోగం సరిగ్గా చేయరు..!
సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ తేదీ ఆధారంగా వ్యక్తుల భవిష్యత్ గురించి తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టినవారు ఎక్కువకాలం ఒకే జాబ్ చేయలేరు. ఏదో ఒక కారణంతో జాబ్ మారుస్తుంటారు. ఏ తేదీల్లో పుట్టినవారు ఇలా ఉంటారో చూద్దాం.

ఏ తేదీల్లో పుట్టినవారు ఉద్యోగాలు మారుస్తారు?
సంఖ్యాశాస్త్రం ఆధారంగా వ్యక్తుల స్వభావం, అలవాట్లు, వృత్తి, భవిష్యత్, ఇతర విషయాల గురించి తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టినవారు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. వారు కష్టపడి పనిచేస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. కానీ కొన్ని తేదీల్లో పుట్టినవారు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. వీరు ఏ పని సరిగ్గా చేయరు. అంతేకాదు ఉద్యోగాన్ని కూడా పదేపదే మారుస్తూ ఉంటారు. ఏదో ఒక కారణంతోటి ఉద్యోగాలు వదిలేస్తూ ఉంటారు. కొత్త ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ఎక్కువగా ఉద్యోగాలు మారుస్తూ ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.
ఏ నెలలో అయినా..
ఏ నెలలో అయినా 6, 15, 24వ తేదీల్లో పుట్టినవారి ఆలోచనలు స్థిరంగా ఉండవు. వారు ఒక్కచోట కుదురుగా ఉండలేరు. ఎక్కువ కాలం ఒక దగ్గర ఉండడానికైనా, పనిచేయడానికైనా వీరు ఇష్టపడరు. మరీ ముఖ్యంగా ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు.. ఎక్కువకాలం ఒకే ఉద్యోగాన్ని చేయలేరు. ఏదో ఒక కారణంతో ఉద్యోగం వదిలేస్తారు. ఒక ఉద్యోగం నుంచి మరొక దాంట్లోకి త్వరగా మారిపోవాలని కోరుకుంటారు.
వీరి స్వభావం ఎలా ఉంటుందంటే?
6, 15, 24వ తేదీల్లో పుట్టిన వ్యక్తులు వారి గురించి వారు ఎక్కువగా కేర్ తీసుకుంటారు. అందంగా, ఫిట్‌గా ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరిని మోసం చేయడానికి ఇష్టపడరు. నచ్చిన వారికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వారిని బాధ పెట్టే పనులు ఎప్పుడూ చేయరు.
వీరికి ఏ రంగాలు సెట్ అవుతాయంటే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారి మూలసంఖ్య 6. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. శుక్రుడి అనుగ్రహం ఈ తేదీల్లో పుట్టినవారిపై ఉంటుంది. సాధారణంగా శుక్రుడిని అందం, కళ, సృజనాత్మకతలకు కారకుడిగా భావిస్తారు. కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన వారు ఫ్యాషన్, కళ, సంగీతం, మోడలింగ్ తదితర సృజనాత్మక రంగాలను ఎంచుకోవడం మంచిది. ఈ రంగాల్లో వారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వ్యాపారంలోనూ వీరికి మంచి భవిష్యత్ ఉంటుందని సూచిస్తున్నారు.