Vastu Tips: ఈ వారాల్లో బట్టలు ఉతకడం అస్సలు మంచిది కాదు! ఎందుకో తెలుసా?
సాధారణంగా మనం బట్టలు ఎప్పుడు పడితే అప్పుడే ఉతుకుతుంటాం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం రోజువారీ పనులకు కూడా శుభ, అశుభ దినాలు, సమయాలు ఉన్నాయి. వాటి ప్రకారం కొన్ని వారాల్లో బట్టలు ఉతకడం మంచిది కాదు. మరి ఏ వారం నాడు బట్టలు ఉతకడం అశుభమో ఇక్కడ తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం..
వాస్తు శాస్త్రం ప్రకారం.. సరైన సమయంలో చేసే పని శుభ ఫలితాలనిస్తుంది. తప్పు సమయంలో చేసే పని అశుభ ఫలితాలనిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం బట్టలు ఉతకడానికి కూడా మంచి రోజు, సమయం ఉన్నాయి. వాటిని పాటించకపోతే నష్టాలు, ఇబ్బందులు రావచ్చు. మరి వారంలో ఏ రోజున బట్టలు ఉతకచ్చు? ఏ రోజున ఉతకకూడదు? ఒకవేళ ఉతికితే ఏమవుతుంది లాంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
గురువారం, శనివారం
గురువారం బట్టలు ఉతకడం అశుభం. దానితోపాటు, శనివారం కూడా బట్టలు ఉతకకూడదు. గురు, శనివారాల్లో బట్టలు ఉతకడం వల్ల లక్ష్మీ, విష్ణు, శని దేవుళ్లు ఆగ్రహిస్తారు. దీనివల్ల ఆర్థిక నష్టం, పనుల్లో ఆటంకాలు, చేస్తున్న పని ఆగిపోవడం, అదృష్టం కలిసిరాకపోవడం వంటివి జరుగుతాయట.
అమావాస్య నాడు..
అమావాస్య రోజు కూడా బట్టలు ఉతకకూడదు. ఇది పితృ దోషానికి దారితీస్తుంది. అలాగే పౌర్ణమి రోజు కూడా బట్టలు ఉతకడం నిషిద్ధం. ఈ రోజు బట్టలు ఉతకడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. ధనప్రాప్తి ఆగిపోతుందట. ఇంట్లో డబ్బు నిల్వదట.
ఈ వారాల్లో..
వాస్తు శాస్త్రం ప్రకారం, సోమ, మంగళ, బుధ, శుక్ర, ఆదివారాలు బట్టలు ఉతకడానికి శుభ దినాలు. ఈ రోజుల్లో బట్టలు ఉతకడం వల్ల సిరి, సంపదలు పెరుగుతాయి. ఇంట్లో సుఖ, శాంతులు నెలకొంటాయి.
ఉదయం 7 నుంచి..
ఉదయం 7 నుంచి 11 గంటల వరకు బట్టలు ఉతకడానికి శుభ సమయం. రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల ధన నష్టం, ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందట. మానసిక ఇబ్బందులు వస్తాయట.