జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో కుజుడు, కేతువుల కలయిక జరగనుంది. దీని ప్రభావంతో 5 రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. వారి కష్టాలన్నీ తీరనున్నాయి. మరి ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో అందులో మీ రాశి ఉందో చెక్ చేసుకోండి. 

 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 7న కుజుడు.. సింహరాశి లోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో అప్పటికే కేతువు ఉంటాడు. కాబట్టి.. కుజుడు, కేతువుల కలయిక జరుగుతుంది. ఈ ప్రభావం 5 రాశులపై ఉంటుంది. ఈ రాశుల వారు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. జీవితంలో విజయం సాధిస్తారు. మరి కుజుడు, కేతువుల కలయిక ఏ రాశుల వారికి శుభ ఫలితాలనిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

మేష రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

మేష రాశికి అధిపతి కుజుడు. కేతువు, కుజుడి కలయిక వల్ల ఈ రాశి వారికి మేలు జరుగుతుంది. కొత్త శక్తితో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఇప్పటివరకు కష్టమనుకున్న పనులు సులువుగా పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. మేషరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. మంగళుడి(కుజుడు) కృపతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు. కేతువుతో మంగళుడి కలయిక వల్ల ఈ రాశి వారిపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఆత్మస్థైర్యం, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతాయి. కెరీర్ లో అభివృద్ధి ఉంటుంది. పరిశోధన, సాంకేతిక రంగాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నవారికి ఈ సమయం అనుకూలం. అదృష్టం కలిసి వస్తుంది.

మకర రాశి

మంగళ, కేతువుల కలయిక వల్ల మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ రాశి వారి జీవితంపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది. పదోన్నతి, కొత్త ఉద్యోగం, వ్యాపార విస్తరణకు ఈ సమయం అనుకూలం. పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కోసం చూస్తున్నవారు శుభవార్తలు వింటారు.

మీన రాశి

మంగళ, కేతువుల కలయిక వల్ల మీన రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. కలలను నిజం చేసుకునే ధైర్యం వస్తుంది. కెరీర్ లో అభివృద్ధి ఉంటుంది. అన్ని పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో విజయం లభిస్తుంది.