MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Astrology: ఈ ఆలయాలను దర్శిస్తే సొంతింటి కల నేరవేరుతుందట.. ఓసారి వెళ్లిరండి!

Astrology: ఈ ఆలయాలను దర్శిస్తే సొంతింటి కల నేరవేరుతుందట.. ఓసారి వెళ్లిరండి!

మనకంటూ ఒక ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. రకరకాల కారణాల వల్ల సొంతిల్లు కట్టుకోలేకపోతారు. జ్యోతిష్యం ప్రకారం సొంత ఇల్లు కట్టుకోవాలంటే కుజుడి అనుగ్రహం ఉండాలి. అందుకోసం ఏం చేయాలి? ఏ ఆలయాలకు వెళ్తే సొంతింటి కల నేరవేరుతుందో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Jun 18 2025, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
సొంతింటి కల నెరవేరాలంటే..
Image Credit : our own

సొంతింటి కల నెరవేరాలంటే..

సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మన ఇంట్లో మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండవచ్చని అనుకుంటారు. అద్దెంట్లో ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చాలా మందికి తెలిసే ఉంటుంది కాబట్టి. చిన్నదో, పెద్దదో.. ఊరిలోనో, సిటీలోనో ఏదో ఒక చోట మనకంటూ ఒక ఇల్లు ఉంటే.. చాలని చాలామంది అనుకుంటారు. అందుకోసం కష్టపడతారు. పైసా పైసా కూడబెడతారు. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సొంతిల్లు కట్టుకోవాలంటే వారిపై కుజుడి అనుగ్రహం ఉండాలట. సాధారణంగా కొన్ని ఆలయాలు దర్శిస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. అలాగే కొన్ని ఆలయాలు దర్శిస్తే.. సొంత ఇంటి కల నేరవేరుతుందట. ఆ ఆలయాలకు వెళ్లి మనసారా ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయట. ముఖ్యంగా సొంతింటి యోగం కలుగుతుందట. దానికోసం ఏ ఆలయాలు దర్శించాలో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
కుజుడి అనుగ్రహంతో..
Image Credit : our own

కుజుడి అనుగ్రహంతో..

కుజుడి అనుగ్రహం ఉంటే సొంతింటి కల నేరవేరుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జాతకంలో కుజుడు బలంగా ఉంటే సొంతింటి యోగం ఖాయమంటున్నారు. కుజుడు బలహీనంగా ఉంటే పరిహారాలు చేసి బలపరచుకోవాలని సూచిస్తున్నారు.

39
అంగారక చతుర్థినాడు..
Image Credit : our own

అంగారక చతుర్థినాడు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు గణపతి భక్తుడు. కుజుడి భక్తికి మెచ్చి నవగ్రహ స్థానం ఇచ్చాడట గణపతి. అంతేకాదు అంగారక చతుర్థి రోజున తనను పూజిస్తే కోరికలు తీరుస్తానని చెప్పాడట. అందుకే సొంతింటి కోసం కుజుడి అనుగ్రహం కోరేవారు అంగారక చతుర్థి రోజున వినాయకుడి ఆలయాలు దర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

49
పిళ్లయార్ పట్టి
Image Credit : google

పిళ్లయార్ పట్టి

పిళ్లయార్ పట్టి అనేది పురాతన పుణ్యక్షేత్రం. ఇది తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఉంది. ఇక్కడ కర్పగ వినాయగర్ ఆలయం ఉంది. ఇల్లు కావాలనుకునేవారు పిళ్లయార్‌పట్టి కర్పగ గణపతిని పూజించాలి. ఇక్కడ గణపతి రెండు చేతులతో.. అంకుశ-పాశం లేకుండా దర్శనమిస్తాడు. తొండం కుడివైపు తిరిగి ఉండటం విశేషం. అంగారక చతుర్థి రోజున కుటుంబంతో వెళ్లి గణపతిని పూజిస్తే సొంతింటి యోగం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

59
భూమినాథర్ ఆలయం
Image Credit : our own

భూమినాథర్ ఆలయం

తిరుచ్చి దగ్గర మణచనల్లూరులో ఉన్న భూమినాథర్ ఆలయం ఇల్లు-స్థలం కొనే యోగాన్ని ఇస్తుంది. శివుడి నుదుటి నుంచి పడిన చెమట బొట్టు నుంచి పుట్టిన శివగణం.. శివుడి ఆదేశం మేరకు ఇల్లు, కట్టడాలు కట్టుకునేవారికి సహాయంగా ఉంటుందట. అందుకే ఇప్పటికీ ఇల్లు-స్థలం కొనే యోగాన్ని ఇస్తోంది ఆ శివగణం. సొంతింటి కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు.

69
సిరువాపురి మురుగన్
Image Credit : google

సిరువాపురి మురుగన్

చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలో ఉన్న సిరువాపురి బాలసుబ్రమణ్య స్వామి ఆలయంలోని మురుగన్.. సొంతింటి కలను నేరవేరుస్తాడని నమ్మకం. ఇక్కడ రాముడు, లవకుశుల మధ్య యుద్ధం జరిగిందని చెబుతారు. అరుణగిరి నాథుడు కీర్తించిన ఆలయం ఇది. సొంతింటి కోసం సిరువాపురి మురుగన్ ను దర్శించి.. అర్చన చేసి, మనసారా ప్రార్థిస్తే కోరిక నెరవేరుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

79
వరాహమూర్తిని పూజిస్తే..
Image Credit : google

వరాహమూర్తిని పూజిస్తే..

తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి నుంచి పోదత్తూర్‌పేట వెళ్లే దారిలో మేల్‌పోదత్తూర్ ఉంది. ఇక్కడ భూదేవి సమేతంగా ధరణి వరాహమూర్తి కొలువై ఉన్నాడు. 11 శనివారాలు ఇక్కడికి వచ్చి, నెయ్యి దీపం వెలిగించి, వరాహమూర్తిని పూజిస్తే భూమికి సంబంధించిన సమస్యలు తీరతాయట. శనిదోష నివారణ కలుగుతుందట. పెళ్లికి ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయట.

89
భూమీశ్వరుడు
Image Credit : google

భూమీశ్వరుడు

చెన్నై నుంచి పుదుచ్చేరి వెళ్లే ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న మరక్కానంలోని భూమీశ్వరుడు.. సొంతింటి యోగాన్ని ఇస్తాడట. ఒక శివభక్తుడి భక్తికి మెచ్చి, మరక్కాల్ పాత్రలో ఉండి మాయమై, తర్వాత భూమి నుంచి బయటకు వచ్చాడట ఈ స్వామి. అందుకే  భూమీశ్వరుడిని పూజిస్తే భూమికి సంబంధించిన సమస్యలు తీరి సొంతింటి యోగం కలుగుతుందని నమ్మకం.

99
బాలగణపతిని పూజిస్తే..
Image Credit : GOOGLE

బాలగణపతిని పూజిస్తే..

పిచ్చనూర్ దగ్గర ఒత్తక్కాల్ మండపం ఉంది. ఇక్కడ బాలగణపతి, పాత్రకాళి అమ్మవారు కొలువై ఉన్నారు. పెళ్లి, పిల్లలు కావాలనుకునేవారు ఇక్కడ మనసారా ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయట. అలాగే ఇటుకలు పేర్చి ప్రార్థిస్తే సొంతింటి యోగం కలుగుతుందని నమ్మకం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ప్రయాణం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు రాత్రికి రాత్రే ధనవంతులవుతారు!
Recommended image2
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టినవారు రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved