MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • IMD Rain Alert : ఒకే వారంలో రెండు అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే

IMD Rain Alert : ఒకే వారంలో రెండు అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే

Weather Updates : ఇదే వారంలో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు… వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

1 Min read
Author : Arun Kumar P
Published : Feb 19 2026, 08:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వర్షాలే వర్షాలు...
Image Credit : Freepik

వర్షాలే వర్షాలు...

Weather Updates : ప్రస్తుతం బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతోంది... ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయట... దీంతో వర్షాలు మరింత జోరందుకోనున్నాయని అంచనా వేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు
Image Credit : Getty

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు

ఫిబ్రవరి 16న అంటే గత సోమవారమే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది... ఇక వీకెండ్ లో (ఫిబ్రవరి 21, శనివారం) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇలా కేవలం ఒకే వారంలో రెండు అల్పపీడనాలు ఏర్పడి తమిళనాడులో జోరువానలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలకు కారణం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.

35
ఏపీలో వర్షాలు
Image Credit : Getty

ఏపీలో వర్షాలు

బంగాళాఖాతంలోని రెండు అల్పపీడనాలు శ్రీలంక వైపు కదులుతూ బలపడనున్నాయని వాతావరణ విభాగం చెబుతోంది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని హెచ్చరించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షతీవ్రత ఎక్కువగా ఉండనుందట... అక్కడక్కడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయంటోంది. ఫిబ్రవరి 21,22,23 (శని, ఆది, సోమవారాలు) వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

45
తెలంగాణపై అల్పపీడనాల ప్రభావం..
Image Credit : Getty

తెలంగాణపై అల్పపీడనాల ప్రభావం..

బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల ప్రభావం తెలంగాణపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 25 నుండి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. హైదరాబాద్ తో సహా చాలా ప్రాంతాల్లో జల్లులు కురుస్తాయని... ఫిబ్రవరి పూర్తయ్యేవరకు ఇవి కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయంటోంది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు తోడయి ప్రమాదకరంగా మారవచ్చు... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

55
ఉత్తరాదిన వర్షాలు ప్రారంభం
Image Credit : PTI

ఉత్తరాదిన వర్షాలు ప్రారంభం

ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. డిల్లీతో పాటు రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో నిన్న(బుధవారం) వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల 20 నుండి 30 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈ వర్షాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కుప్పంలో రైతు బజార్ ప్రారంభించిన CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
Pawan Kalyan : వైసిపి బిగ్ షాకిచ్చి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ వరుపుల సుబ్బారావు?
Recommended image3
Now Playing
పవన్ రాకతో ఉప్పొంగిన పిఠాపురం | Deputy CM Pawan Kalyan Craze In Pithapuram | Asianet News Telugu
Related Stories
Recommended image1
IMD Rain Alert : రాబోయే 24 గంటల్లో కుండపోత.. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
Recommended image2
IMD Rain Alert : ఇక వర్షాలు షురూ.. ఏఏ రాష్ట్రాల్లో, ఎన్నిరోజులు కురుస్తాయో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved