MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • IMD Rain Alert : ఇక వర్షాలు షురూ.. ఏఏ రాష్ట్రాల్లో, ఎన్నిరోజులు కురుస్తాయో తెలుసా..?

IMD Rain Alert : ఇక వర్షాలు షురూ.. ఏఏ రాష్ట్రాల్లో, ఎన్నిరోజులు కురుస్తాయో తెలుసా..?

Weather Update : కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏఏ రాష్ట్రాల్లో, ఎప్పుడు వర్షాలు కురుస్తాయంటే.. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 18 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నేటి నుండే వానలు...
Image Credit : X/APSDMA

నేటి నుండే వానలు...

IMD Rain Alert : చలికాలం ముగిసింది... ఇక ఎండల తీవ్రత పెరుగుతుందని అనుకుంటుంటే వర్షాలు మొదలయ్యాయి. భారతదేశంలో ఇవాళ్టి (ఫిబ్రవరి 18, బుధవారం) నుండి వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఈ నెలంతా వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయట.

25
బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్..
Image Credit : Getty

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉండనుంది... పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళలోనూ అక్కడక్కడ జల్లులు పడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణుల అంచనా.

Related Articles

Related image1
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఒకటి కాదు రెండు అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..
Related image2
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్లకల్లోలం... ఈ ప్రాంతాల్లో ఏకంగా 30మిమీ వర్షపాతం తప్పదా..?
35
ఉత్తరాది రాష్ట్రాలకు వర్షసూచన
Image Credit : PTI

ఉత్తరాది రాష్ట్రాలకు వర్షసూచన

ఉత్తరాది రాష్ట్రాలను కూడా వర్షాలు వదిలిపెట్టడంలేదు. దేశ రాజధాని డిల్లీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే పంజాబ్, హర్యానా, చండీగడ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఫిబ్రవరి 18,19 రెండ్రోజులు ఈ రాష్ట్రాల్లో వర్ష సూచనలు ఉన్నట్లు ఐఎండి ప్రకటించింది.

45
తెలంగాణలో వర్షాలు
Image Credit : X/APSDMA

తెలంగాణలో వర్షాలు

తెలంగాణ విషయానికి వస్తే ఫిబ్రవరి 22 నుండి వర్షాలు మొదలవుతాయని... వీటికి ఉరుములు మెరుపులు, పిడుగులు తోడవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాలను ఈ వర్షాలు వదిలిపెట్టవని అంటున్నారు. కొన్నచోట్ల వడగళ్ల వానలు పడే అవకాశం ఉంది... ఇవి రైతులకు పంట నష్టం కలిగించవచ్చని తెలిపారు. మొత్తంగా తెలంగాణలో ఫిబ్రవరి 22,23,24 తేదీల్లో పలుచోట్ల 20 నుండి 30 మిల్లిమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.

55
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
Image Credit : ani

ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ పై కూడా అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలుంటాయని హెచ్చరిస్తున్నారు. తమిళనాడు బార్డర్స్ లోని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలుంటాయి కాబట్టి మత్స్యకారులు, తీరప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Half Day Schools : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. ఫిబ్రవరి 19 నుండే ఆ స్కూళ్లకు ఒంటిపూట
Recommended image2
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్లకల్లోలం... ఈ ప్రాంతాల్లో ఏకంగా 30మిమీ వర్షపాతం తప్పదా..?
Recommended image3
ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టిన.. కౌన్సిల‌ర్ల‌కు, ఛైర్‌ప‌ర్స‌న్‌కు వ‌చ్చే జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Related Stories
Recommended image1
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఒకటి కాదు రెండు అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..
Recommended image2
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్లకల్లోలం... ఈ ప్రాంతాల్లో ఏకంగా 30మిమీ వర్షపాతం తప్పదా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved