MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్

Weather Update: నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయాయి. అయితే, ఈశాన్య రుతుపవనాల రాకతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానున్న కొద్ది రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు ఇచ్చింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 14 2026, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మారుతున్న వాతావరణం.. కూల్ కానున్న తెలుగు రాష్ట్రాలు
Image Credit : Gemini

మారుతున్న వాతావరణం.. కూల్ కానున్న తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల వాతావరణంలో మరోసారి కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తుండగా, మరోవైపు ఈశాన్య రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఉదయం వేళల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత అధికంగా ఉంటున్నప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై చల్లటి ఈదురుగాలులతో కూడిన జల్లులు పడుతున్నాయి. ఈ అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు
Image Credit : Gemini

ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు

అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయి. తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటుంది.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

35
తెలంగాణ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. ఎల్లో అలర్ట్ జారీ
Image Credit : Gemini

తెలంగాణ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలోని దక్షిణ, తూర్పు, మధ్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద తలదాచుకోవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుంది.

45
హైదరాబాద్‌లో ఉక్కపోత నుంచి వర్షపు జల్లుల వరకు
Image Credit : Gemini

హైదరాబాద్‌లో ఉక్కపోత నుంచి వర్షపు జల్లుల వరకు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నేడు ఆకాశం సాధారణంగా మేఘావృతమై కనిపిస్తుంది. ఉదయం సమయంలో ఉక్కపోత ఇబ్బంది పెట్టినప్పటికీ, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలు ఉన్నాయి.

ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉంది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయి. సాయంత్రం వేళ వాన పడితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి.

55
రైతులు, మత్స్యకారులకు వాతావరణ శాఖ కీలక సూచనలు
Image Credit : Gemini

రైతులు, మత్స్యకారులకు వాతావరణ శాఖ కీలక సూచనలు

వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల నేపథ్యంలో రైతులు తమ ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తులను తడవకుండా సురక్షిత ప్రాంతాలకు లేదా గోదాములకు తరలించాలని అధికారులు సూచించారు.

ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి. అలాగే సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తీర ప్రాంత హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించడం చాలా మంచిది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
తిరుపతి
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Rain Delay
NZNZ
-
INDIND
-
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు కంటిన్యూ
Recommended image2
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
Recommended image3
Now Playing
మురసు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం | CM Chandrababu Reviews Flood Situation
Related Stories
Recommended image1
Mutual Funds: రూ.5 లక్షలు ఉంటే చాలు.. రూ.80 లక్షల జాక్‌పాట్ కొట్టే సింపుల్ ట్రిక్
Recommended image2
Gold: ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలున్న టాప్ 10 దేశాలు ఇవే.. భారత్ ఏ స్థానంలో ఉంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved