MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Gold: ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలున్న టాప్ 10 దేశాలు ఇవే.. భారత్ ఏ స్థానంలో ఉంది?

Gold: ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలున్న టాప్ 10 దేశాలు ఇవే.. భారత్ ఏ స్థానంలో ఉంది?

Gold Reserves: పలు దేశాలు బంగారు నిల్వలను క్రమంగా పెంచుకుంటున్నాయి. ప్రపంచ గోల్డ్ రిజర్వుల్లో చైనా 5వ స్థానానికి చేరుకుంది. భారత్ వద్ద ఉన్న బంగారు నిల్వలు ఎంత? ఏ స్థానంలో ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 14 2026, 08:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గోల్డ్ రిజర్వుల్లో టాప్ దేశాల లిస్ట్ చూస్తే మైండ్ బ్లాకే
Image Credit : chatgpt

గోల్డ్ రిజర్వుల్లో టాప్ దేశాల లిస్ట్ చూస్తే మైండ్ బ్లాకే

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో మనందరికీ తెలిసిందే. కష్టకాలంలో దేశ ఆర్థిక పునాదిని కాపాడేది ఈ బంగారు నిల్వలే. తాజాగా విడుదలైన గ్లోబల్ డేటా ప్రకారం, అంతర్జాతీయంగా అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశాల జాబితాలో చైనా భారీ దూకుడు ప్రదర్శించింది. రష్యాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద గోల్డ్ రిజర్వ్ కలిగిన దేశంగా చైనా నిలిచింది. ప్రస్తుతం చైనా కంటే ముందు అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ మాత్రమే ఉన్నాయి.

ప్రముఖ ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్ 'ది కోబెసీ లెటర్' వెల్లడించిన గణాంకాల ప్రకారం, చైనా వద్ద ప్రస్తుతం ఏకంగా 2,410 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. టాప్-3 దేశాల జాబితాలోకి చేరేందుకు చైనా ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది. ఫ్రాన్స్ వద్ద 2,437 టన్నులు, ఇటలీ వద్ద 2,452 టన్నుల బంగారం ఉంది.

అంటే, చైనా ఫ్రాన్స్ కంటే కేవలం 27 టన్నులు, ఇటలీ కంటే 42 టన్నులు మాత్రమే వెనుకబడి ఉంది. ఇక ఈ జాబితాలో భారత్ 881 టన్నుల నిల్వలతో 8వ స్థానంలో నిలిచింది. చైనా వద్ద భారత్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ బంగారం ఉండటం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ ఏడాది చివరికల్లా టాప్-3కి చైనా?
Image Credit : Getty

ఈ ఏడాది చివరికల్లా టాప్-3కి చైనా?

చైనా సెంట్రల్ బ్యాంక్ అయిన 'పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా' ఆగకుండా పసిడి కొనుగోళ్లు చేస్తోంది. ఇదే వేగంతో కొనుగోళ్లు కొనసాగితే, ఈ ఏడాది చివరి నాటికి చైనా.. ఫ్రాన్స్, ఇటలీలను దాటేసి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద బంగారం నిల్వలున్న దేశంగా అవతరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

35
వరుసగా 23 నెలల నుంచి బిగ్ బైయింగ్
Image Credit : Getty

వరుసగా 23 నెలల నుంచి బిగ్ బైయింగ్

చైనా గత 23 నెలలుగా ఒక్క నెల కూడా గ్యాప్ ఇవ్వకుండా వరుసగా బంగారం కొనుగోలు చేస్తూనే ఉంది. సెప్టెంబర్ నెలలోనే చైనా బ్యాంక్ ఏకంగా 23 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేసింది. గత ఒక సంవత్సర కాలంలో చైనా ఒకే నెలలో చేసిన అతిపెద్ద కొనుగోలు ఇదే కావడం విశేషం. అంతకుముందు జూలై, ఆగస్టు నెలల్లో కూడా నెలకు 20 టన్నులకు పైగా బంగారాన్ని తమ ఖజానాలో జమ చేసుకుంది. ఈ ఏడాదిలో సెప్టెంబర్ వరకు చూస్తే చైనా మొత్తం 103 టన్నులకు పైగా కొత్త బంగారాన్ని కొనుగోలు చేసింది.

45
అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయికి పసిడి ధరలు
Image Credit : Getty

అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయికి పసిడి ధరలు

ఒకవైపు దేశాలు బంగారం నిల్వలను పెంచుకుంటుంటే, మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయిలో ప్రతి ఔన్సుకు 4,207 డాలర్ల మార్కును చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా ఊపందుకుని ప్రతి ఔన్సుకు 61.12 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

పసిడి ధరలు ఇలా అకస్మాత్తుగా పెరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి..

1. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం పై ఉన్న ఆందోళనలు కాస్త తగ్గాయి.

2. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపును నిలిపివేస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి మళ్లీ ప్రసిడిలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

55
ప్రపంచ గోల్డ్ రిజర్వ్స్ టాప్ 10 దేశాలు ఇవే
Image Credit : Getty

ప్రపంచ గోల్డ్ రిజర్వ్స్ టాప్ 10 దేశాలు ఇవే

ది కోబెసీ లెటర్ డేటా ప్రకారం.. బంగారం నిల్వలు (టన్నుల్లో) టాప్ 10 లిస్ట్

1 అమెరికా 8,133

2 జర్మనీ 3,351

3 ఇటలీ 2,452

4 ఫ్రాన్స్ 2,437

5 చైనా 2,410

6 రష్యా 2,305

7 స్విట్జర్లాండ్ 1,040

8 భారత్ 881

9 జపాన్ 846

10 నెదర్లాండ్స్ 613

గమనిక: ఈ లిస్ట్‌లో ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ (IMF) నిల్వలను చేర్చలేదు. ఐఎంఎఫ్ వద్ద సుమారు 2,814 టన్నుల బంగారం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
చైనా
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Rupee: ఇండియా కాకుండా రూపాయి చెల్లే ఇతర దేశాలు ఏవో తెలుసా?
Recommended image2
Ancient Egypt: రాజులతోపాటు సేవకులనూ పాతిపెట్టేవారంట! ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?
Recommended image3
నదులు సముద్రంలో కలవకపోతే ఏమవుతుంది.? విపత్తు త‌ప్ప‌ద‌ని తెలుసా.?
Related Stories
Recommended image1
Festive Car Buying Tips: కొత్త కారు కొనేముందు ఈ 5 సీక్రెట్స్ తెలిస్తే.. లక్షల్లో ఆదా పక్కా
Recommended image2
Mutual Funds: రూ.5 లక్షలు ఉంటే చాలు.. రూ.80 లక్షల జాక్‌పాట్ కొట్టే సింపుల్ ట్రిక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved