MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Andhra Pradesh
  • Twin Towers: ఆంధ్రప్రదేశ్‌లో అద్భుత నిర్మాణం.. 47 అంత‌స్తుల ట్విన్ ట‌వ‌ర్స్‌. ఎక్క‌డంటే.?

Twin Towers: ఆంధ్రప్రదేశ్‌లో అద్భుత నిర్మాణం.. 47 అంత‌స్తుల ట్విన్ ట‌వ‌ర్స్‌. ఎక్క‌డంటే.?

Twin Towers: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో మొత్తం 34 అజెండా అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 06 2026, 07:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అమరావతి అభివృద్ధికి భారీ ఊతం..
Image Credit : Gemini AI

అమరావతి అభివృద్ధికి భారీ ఊతం..

రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం మరోసారి ప్రాధాన్యం ఇచ్చింది. 47 అంతస్తుల ట్విన్ టవర్స్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో పాటు, కార్పొరేట్ సంస్థలు, క్వాంటమ్ టెక్నాలజీ సంస్థలకు ఈ భవనాల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించింది. హైకోర్టు భవనానికి రీ-డిజైన్ ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రముఖ 'అమరావతి ఐ' ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు రీ-టెండర్లకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రుల బృందం (GoM) చేసిన సిఫార్సులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వ్యాపారాలకు ఊతం.. కొత్త విధానాలకు కేబినెట్ ఆమోదం
Image Credit : Asianet News

వ్యాపారాలకు ఊతం.. కొత్త విధానాలకు కేబినెట్ ఆమోదం

రాష్ట్రంలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించే లక్ష్యంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026 (ఆమ్నిబస్ చట్టం) ముసాయిదాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఏపీ పీపీపీ పాలసీ-2026కు కూడా ఆమోదం లభించింది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులకు రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, పెట్టుబడులకు ఉన్న అడ్డంకులను తొలగించడం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడమే ఈ విధానాల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

34
భూములు, పట్టణాభివృద్ధి, విద్య రంగాల్లో కీలక నిర్ణయాలు
Image Credit : our own

భూములు, పట్టణాభివృద్ధి, విద్య రంగాల్లో కీలక నిర్ణయాలు

కొత్త జిల్లాలకు అనుగుణంగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల (UDA) పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో యూడీఏల సంఖ్య 21 నుంచి 23కు పెరగనుంది. కొత్త జిల్లాల అవసరాలకు అనుగుణంగా 15 కొత్త జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) పోస్టులు సృష్టించనున్నారు. రెండు కొత్త ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కూడా అనుమతి లభించింది. విజయవాడ ఆటోనగర్‌లో యూడీఎస్ హక్కుల క్రమబద్ధీకరణ, 400 హౌసింగ్ యూనిట్ల భూ సమస్య పరిష్కారం, మున్సిపల్ భూముల లీజు గడువు పెంపు, ఏదుల ముస్తూరులో భూములను APIICకు, తిమ్మసముద్రంలో భూములను CUDAకు బదిలీ చేయడం వంటి ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది.

44
భూసేకరణ, చట్టాలు, మౌలిక సదుపాయాలపై నిర్ణయాలు
Image Credit : our own

భూసేకరణ, చట్టాలు, మౌలిక సదుపాయాలపై నిర్ణయాలు

కుప్పం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం భూసేకరణలో డి-ఫామ్ లేని సాగుదారులకు ఎకరాకు రూ.12.44 లక్షల ప్రత్యేక పరిహారం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. మోతడక ప్రాంతంలో 2,344 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో హైస్పీడ్ రైలు మార్గం, ఇన్నర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూముల సమీకరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కండలేరు నుంచి పరిశ్రమల క్లస్టర్‌కు నీటి సరఫరా ప్రాజెక్టుకు అనుమతి లభించింది. అదే సమయంలో దిశ చట్టం-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లను ఉపసంహరించుకుని మరింత సమర్థవంతమైన కొత్త చట్టాలను తీసుకురావాలని నిర్ణయించారు. అదనంగా పాదచారుల భద్రత పాలసీ-2026కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
నారా చంద్రబాబు నాయుడు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Recommended image2
Now Playing
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu
Recommended image3
Now Playing
జగన్ మత మార్పిడులపై Vijaysai Reddy Sensational Comments | Asianet Telugu
Related Stories
Recommended image1
OYO Rules: పెళ్లికాని కపుల్స్ ఓయో రూమ్‌లో గ‌డ‌ప‌డం నేరమా.? చ‌ట్టం ఏం చెబుతోంది.?
Recommended image2
ఇవేం టాయిలెట్స్ బాబోయ్‌.. బ‌య‌ట నుంచి అంతా క‌నిపిస్తుంది. కానీ లోపికి వెళ్తే మాత్రం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved