MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • IMD Rain Alert : ఆకాశంలో నల్లని మేఘాలు లోడింగ్... తెలంగాణలో 10, ఏపీలో 7 జిల్లాల్లో భారీ వర్షాలు

IMD Rain Alert : ఆకాశంలో నల్లని మేఘాలు లోడింగ్... తెలంగాణలో 10, ఏపీలో 7 జిల్లాల్లో భారీ వర్షాలు

Heavy Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. గత పది పదిహేను రోజులుగా జోరు వానలు కురుస్తుండగా నేడు కూడా పలు జిల్లాల్లో మంచి వానలే పడతాయని ఇరు రాష్ట్రాల వాతావరణ విభాగాలు ప్రకటించాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 06 2026, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Image Credit : Gemini ai

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Rain Alert : ఎల్ నినో ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా కనిపించడంలేదు. ప్రపంచ వాతావరణ సంస్థలు భారతదేశంలో ఎల్ నినో ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుందని… ఇకపై పెద్దగా వర్షాలు కురిసే అవకాశాలు లేవంటున్నాయి... కానీ ఇందుకు భిన్నంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో అయితే జూలై సెకండాఫ్ లో కుండపోత వానలు పడ్డాయి... ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పరవాలేదు. ఇక ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో గోదావరి, కృష్ణా నదుల్లోకి వరదనీరు చేరి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి... దీంతో జలాశయాలన్ని నిండుకుండల్లా మారాయి. వాగులు వంకలు, చెరువులు కూడా జలకళను సంతరించుకున్నాయి.

ఇలా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వానలు మరికొన్నిరోజులు కొనసాగుతాయని వాతావారణ నిపుణులు ప్రకటించారు. ఇవాళ (ఆగస్ట్ 6, గురువారం) కూడా ఇరు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని... ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. కాబట్టి తెలుగు ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు..
Image Credit : Gemini AI

నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు..

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం... నేడు (ఆగస్ట్ 6) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఇక అన్ని జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. రాజధాని నగరం హైదరాబాద్ లో రోజంతా ఆకాశం పాక్షికంగా మేఘాలతో నిండివుంటుంది... కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

ఇక తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు.

Related Articles

Related image1
Rain Facts : వర్షాన్ని ఎలా కొలుస్తారు? మిల్లీమీటర్, సెంటీమీటర్ వర్షం అంటే ఎంత?
Related image2
Frog Rain : కప్పల వర్షం నిజమేనా? అవి ఆకాశంలోంచి పడతాయా? సైన్స్ ఏం చెబుతోంది
33
నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురిసే జిల్లాలివే..
Image Credit : ANI

నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురిసే జిల్లాలివే..

పశ్చిమమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో ఇవాళ (06-08-2026, గురువారం) శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు కురిసే అవకాశాలున్నాయట. ఇలా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

ఇక ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మర్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు సంస్థ పేర్కొంది. అయితే కేేవలం వర్షాలే కాదు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి చెట్లు, పోల్స్,హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని APSDMA సూచించింది. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు కాపర్లు అప్రమత్తంగా ఉండాలని... వర్ష సమయంలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Beer Brands In Hyderabad: హైదరాబాద్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 5 బీర్లు ఇవే
Recommended image2
మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకో బ్యాడ్ న్యూస్‌, క్యాష్‌లెస్ చికిత్స‌ల‌కు తాత్కాలిక్ బ్రేక్
Recommended image3
కొత్త ఇంటికి కరెంట్ మీట‌ర్ ఎలా తీసుకోవాలి? అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు
Related Stories
Recommended image1
Rain Facts : వర్షాన్ని ఎలా కొలుస్తారు? మిల్లీమీటర్, సెంటీమీటర్ వర్షం అంటే ఎంత?
Recommended image2
Frog Rain : కప్పల వర్షం నిజమేనా? అవి ఆకాశంలోంచి పడతాయా? సైన్స్ ఏం చెబుతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved