MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • August Long Weekends : ఆగస్ట్ లో ప్రతి వీక్ లాంగ్ వీకెండ్... ఏ వారం, ఎన్ని సెలవులో తెలుసా?

August Long Weekends : ఆగస్ట్ లో ప్రతి వీక్ లాంగ్ వీకెండ్... ఏ వారం, ఎన్ని సెలవులో తెలుసా?

ఈ ఆగస్ట్ ఇంకా నాలుగు వారాలు మిగిలివున్నాయి… అయితే అన్నింటికి అన్ని లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. ఏవారంలో ఎన్ని సెలవులు వీకెండ్ తో కలిసి వస్తున్నాయి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Aug 06 2026, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆగస్ట్ లో అన్నీ లాంగ్ వీకెండ్సే..
Image Credit : Gemini AI

ఆగస్ట్ లో అన్నీ లాంగ్ వీకెండ్సే..

August Long Weekends : సాధారణంగా ప్రతి ఏడాది ఆగస్ట్ లో భారీగా సెలవులు వస్తుంటాయి. పండగలు, ప్రత్యేక పర్వదినాలతో పాటు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవులు ఉంటాయి... గత కొన్నేళ్ళుగా భారీ వర్షాల కారణంగా కూడా ఆగస్ట్ లో సడన్ హాలిడేస్ వస్తున్నాయి. ఈసారి కూడా ఆగస్ట్ లో ఎక్కువరోజులు సెలవులు ఉన్నాయి.

ఈ ఆగస్ట్ సెలవుల గురించి మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే చాలా సెలవులు వీకెండ్ తో కలిసి వస్తున్నాయి... అంటే వరుస సెలవులు కలిసివస్తున్నాయన్నమాట. ఇలా ఈ నెలలో ఇంకా నాలుగు వీకెండ్స్ మిగిలివున్నాయి... వరుస సెలవులతో అన్నీ లాంగ్ వీకెండ్స్ గా మారనున్నాయి. మరి ఏ వారాంతంతో ఏ సెలవులు కలిసివస్తున్నాయి? ఎన్నిరోజులు సెలవులు వస్తున్నాయి? అనేది తెలుసుకుంటే ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేసుకోడానికి వీలుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫస్ట్ లాంగ్ వీకెండ్... ఆగస్ట్ 8,9,10 సెలవులే
Image Credit : Gemini AI

ఫస్ట్ లాంగ్ వీకెండ్... ఆగస్ట్ 8,9,10 సెలవులే

ఈ వారాంతం వరుసగా మూడ్రోజులు సెలవులున్నాయి. ఆగస్ట్ 8న రెండో శనివారం... కాబట్టి ప్రతి నెలలో మాదిరిగానే ఈరోజు అధికారికంగా సెలవు ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు గవర్నమెంట్ ఉద్యోగులకు కచ్చితంగా సెలవు ఉంటుంది. ఇక ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు ప్రతి వారంలో మాదిరిగానే శనివారం హాలిడే. ఇలా విద్యార్థులు, ఉద్యోగులకు ఈ శనివారం సెలవుంది.

ఇక ఆగస్ట్ 9 ఆదివారం కాబట్టి సాధారణ సెలవుంది. అయితే ఈ ఆదివారం ఆషాడమాసంలో చివరిది... అందుకే హైదరాబాద్ లో అట్టహాసంగా బోనాల వేడుకలు జరుగుతాయి. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంతో పాటు నగరంలోని అన్ని అమ్మవార్ల ఆలయాల్లో బోనాల వేడుకలు నిర్వహిస్తారు. నగర ప్రజలంతా అమ్మవారికి బోనాలు సమర్పించి కుటుంబసభ్యులు, బంధువులతో విందు జరుపుకుంటారు. కేవలం హైదరాబాద్ లోనే కాదు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఆదివారం బోనాల సందడి ఉంటుంది.

ఇలా బోనాల వేడుకల నేపథ్యంలో తర్వాతిరోజు అంటే ఆగస్ట్ 10 (సోమవారం) అధికారిక సెలవు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంటే తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి ఈరోజు సెలవు అన్నమాట. ఉద్యోగులకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది. ఇలా ఈ వీకెండ్ లో వరుసగా మూడ్రోజుల సెలవులు కలిసివస్తున్నాయి.

Related Articles

Related image1
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే
Related image2
Schools Bandh : తెలుగు విద్యార్థులకు ఊహించని సెలవు... స్కూళ్లు, కాలేజీల బంద్ కు జేఏసి పిలుపు
35
సెకండ్ లాంగ్ వీకెండ్... ఆగస్ట్ 15, 16 సెలవులే
Image Credit : Gemini AI

సెకండ్ లాంగ్ వీకెండ్... ఆగస్ట్ 15, 16 సెలవులే

ఓ లాంగ్ వీకెండ్ ముగస్తుందో లేదో మరోటి రెడీగా ఉంటుంది. ఆగస్ట్ 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం... జాతీయ పర్వదినం సందర్భంగా విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు ఉంటుంది. జెండా ఆవిష్కరణ, ప్రత్యేక కార్యక్రమాల అనంతరం విద్యార్థులు, ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోవచ్చు. అయితే ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం శనివారం వస్తోంది... కాబట్టి ఆదివారం సెలవు కలిసివస్తోంది. ఇలా ఆగస్ట్ 15, 16 (శని, ఆదివారం) రెండ్రోజులు సెలవు... వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారింది.

45
థర్డ్ లాంగ్ వీకెండ్... ఆగస్ట్ 21, 22, 23 సెలవులే
Image Credit : X/Banda Karthika Reddy

థర్డ్ లాంగ్ వీకెండ్... ఆగస్ట్ 21, 22, 23 సెలవులే

ఆగస్ట్ 21,22,23న వరస సెలవులు వస్తున్నాయి... అంటే ఇదికూడా లాంగ్ వీకెండే. ఆగస్ట్ 21 (శుక్రవారం) వరలక్ష్మి వ్రతం కాబట్టి తెలుగింటి మహిళలు భక్తిశ్రద్దలతో పూజలు జరుపుకుంటారు. అందుకే మహిళా ఉద్యోగులు పూజ జరుపుకునేందుకు వీలుగా ఈరోజు ఐచ్చిక సెలవు ఇచ్చాయి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు. అంటే అధికారిక సెలవు లేకున్నా కావాలనుకుంటే వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు.

ఇక ప్రతివారం మాదిరిగానే ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు ఆగస్ట్ 22న కూడా శనివారం సెలవు ఉంటుంది. అంతేకాదు ఇది నెలలో నాలుగో శనివారం... కాబట్టి బ్యాంకు ఉద్యోగులకు సెలవు. కొన్ని విద్యాసంస్థలకు కూడా శనివారం సెలవే. ఇలా ఉద్యోగులు, విద్యార్థులకు ఆగస్ట్ 22న సెలవు ఉంది.

ఆగస్ట్ 23 ఆదివారం.... కాబట్టి సాధారణ సెలవే. ఇలా ఆగస్ట్ 21, 22 సెలవులకు ఆదివారం కలిసిరావడంతో వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారింది. ఇది ఆగస్ట్ లో వరుసగా వచ్చే మూడో లాంగ్ వీకెండ్. దీని తర్వాత కూడా ఇంకో లాంగ్ వీకెండ్ మిగిలివుంటుంది.

55
ఫోర్త్ లాంగ్ వీకెండ్...ఆగస్ట్ 26, 28,29, 30 సెలవులే
Image Credit : Gemini AI

ఫోర్త్ లాంగ్ వీకెండ్...ఆగస్ట్ 26, 28,29, 30 సెలవులే

ఆగస్ట్ ఎండింగ్ లో అయితే నాలుగైదు రోజుల సెలవులు ఉన్నాయి. ఆగస్ట్ 26న (బుధవారం) ముస్లింల పవిత్ర పండగ ఈద్ మిలాదున్ నబి ఉంది... దీంతో తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు అధికారిక సెలవు ఉంది. మధ్యలో ఒక్కరోజు (ఆగస్ట్ 27, గురువారం) వర్కింగ్ డే. తర్వాత ఆగస్ట్ 28 (శుక్రవారం) శ్రావణ పూర్ణిమ లేదా రాఖీ పౌర్ణమి. హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు... అన్నాచెల్లెల్ల అనుబంధాల పండగ రాఖీ కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు సెలవు ఉంది. ఇక ఆగస్ట్ 29 (శనివారం), ఆగస్ట్ 30 (ఆదివారం) సాధారణంగా వచ్చే సెలవులు. ఇలా వరుసగా ఆగస్ట్ చివర్లో వరుస సెలవులు వస్తున్నాయి... వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Recommended image3
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Related Stories
Recommended image1
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే
Recommended image2
Schools Bandh : తెలుగు విద్యార్థులకు ఊహించని సెలవు... స్కూళ్లు, కాలేజీల బంద్ కు జేఏసి పిలుపు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved