- Home
- Andhra Pradesh
- కేవలం డిగ్రీ చదివితే చాలు.. రూ.44,70,000 సాలరీతో SBI జాబ్, హైదరాబాద్, అమరావతిలో పోస్టింగ్
కేవలం డిగ్రీ చదివితే చాలు.. రూ.44,70,000 సాలరీతో SBI జాబ్, హైదరాబాద్, అమరావతిలో పోస్టింగ్
Bank Jobs : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకులో ఉద్యోగం… లక్షల్లో సాలరీ, మంచి హోదా… తెలంగాణ, ఏపీలోనే పోస్టింగ్… ఇంకేం కావాలి. వెంటనే తెలుగు యువత SBI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొండి.

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్ జాబ్స్
Bank Jobs : వైట్ కాలర్ జాబ్స్ చేయాలని చాలామంది యువత కల... ఎలాంటి శారీరక శ్రమ లేకుండా హాయిగా ఏసీలో కూర్చుని చేసే ఉద్యోగాలివి, అందుకే వీటికి డిమాండ్ కాస్త ఎక్కువ. వీటిలో బ్యాంక్ ఉద్యోగాలు ముఖ్యమైనవి... అందుకే కేవలం బ్యాంకింగ్ జాబ్స్ కోసమే యువతీయువకులు ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతుంటారు. అలాంటివారికి గుడ్ న్యూస్... తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.
ఎస్బిఐలో మొత్తం 996 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SO) పోస్టులను భర్తీ చేయనున్నారు...ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. SBI అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు... కాబట్టి బ్యాంక్ ఉద్యోగాలపై ఆసక్తి కలిగి అన్ని అర్హతలున్న యువత వెంటనే అప్లై చేసుకొండి.
SBI లో ఖాళీలు
VP వెల్త్ (SRM) – 506 పోస్టులు
AVP వెల్త్ (RM) – 206 పోస్టులు
కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (CRE) – 284 పోస్టులు
రిజర్వేషన్ల వారిగా ఖాళీలు :
VP వెల్త్ (SRM) :
ఎస్సి 77 (బ్యాక్ లాగ్ 15)
ఎస్టీ 34 (బ్యాక్ లాగ్ 10)
ఓబిసి 119 (బ్యాక్ లాగ్ 17)
ఈడబ్ల్యుఎస్ 46
అన్ రిజర్వుడ్ 188
AVP వెల్త్ (RM) :
ఎస్సి 33
ఎస్టీ 15 (బ్యాక్ లాగ్ 4)
ఓబిసి 52
ఈడబ్ల్యుఎస్ 20
అన్ రిజర్వుడ్ 82
కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ :
ఎస్సి 47
ఎస్టీ 21
ఓబిసి 73
ఈడబ్ల్యుఎస్ 28
అన్ రిజర్వుడ్ 115
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు :
అమరావతి సర్కిల్ పరిధిలో VP వెల్త్ (SRM) 13, AVP వెల్త్ (RM) 5, కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ 11 పోస్టులను భర్తీ చేయనున్నారు.
హైదరాబాద్ సర్కిల్ పరిధిలో VP వెల్త్ (SRM) 19, AVP వెల్త్ (RM) 11, కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ 13 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 02 డిసెంబర్ 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : 23 డిసెంబర్ 2025
విద్యార్హతలు
అన్ని పోస్టులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ తప్పనిసరి. MBA (బ్యాంకింగ్/ఫైనాన్స్/మార్కెటింగ్) లాంటి ఉన్నత చదువులు ఉంటే అదనపు విలువ ఉంటుంది. CFP, CFA, NISM లాంటి సర్టిఫికెట్లు ఉంటే ఎంపికలో మంచి ప్రాధాన్యం లభిస్తుంది.
అనుభవం
VP వెల్త్ (SRM): కనీసం 6 ఏళ్లు బ్యాంకింగ్/వెల్త్ మేనేజ్‌మెంట్ రంగంలో అనుభవం
AVP వెల్త్ (RM): 3 ఏళ్ల అనుభవం (లేదా SBI వెల్త్ CREలకు 4 ఏళ్ల అనుభవం)
కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ : డాక్యుమెంటేషన్ పనుల్లో అనుభవం, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉంటే చాలు
వయోపరిమితి (01.05.2025 నాటికి)
VP వెల్త్ – 26 నుంచి 42 ఏళ్లు
AVP వెల్త్ – 23 నుంచి 35 ఏళ్లు
CRE – 20 నుంచి 35 ఏళ్లు
SC/ST, OBC, PwBD, మాజీ సైనికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
ముందుగా వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. ఎలాంటి రాతపరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ (నేరుగా/టెలిఫోన్/వీడియో) ఆధారంగా ఎంపిక చేస్తారు. చివరగా CTC జీతంపై చర్చలు ఉంటాయి.
దరఖాస్తు
దరఖాస్తు రుసుము
SC / ST / PwBD – ఫీజు లేదు
ఇతర అభ్యర్థులు – ₹750 (ఆన్‌లైన్‌లో చెల్లించాలి)
ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తి, అర్హత ఉన్నవారు https://sbi.bank.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ SBI రిక్రూట్‌మెంట్ 2025, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్నత స్థాయి పదవులు కోరుకునే వారందరికీ ఒక అద్భుతమైన అవకాశం. తప్పకుండా దరఖాస్తు చేసుకోండి!
గమనిక : ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి.

