IMD Jobs : నెలనెలా రూ.1,23,100 సాలరీతో .. ఎగ్జామ్ లేకుండానే భారత వాతావరణ శాఖలో ఉద్యోగాలు
IMD Jobs : ఎలాంటి పరీక్ష లేకుండానే నెలనెలా లక్షల రూపాయల జీతంతో భారత వాతావరణ శాఖలో ఉద్యోగాలను పొందే అద్భుత అవకాశం… ఇంకెందుకు ఆలస్యం. మీకు ఈ అర్హతలుంటే వెంటనే అప్లై చేసుకొండి.

IMD లో ఉద్యోగాలు
India Meteolorgical Department Jobs : నిరుద్యోగ యువతకు సూపర్ ఛాన్స్... కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత వాతావరణ శాఖలో ఉద్యోగాలు చేసే అద్భుత అవకాశం. IMD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 134 ఖాళీల భర్తీకి భారత వాతావరణ శాఖ సిద్దమయ్యింది... ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
IMD ఖాళీల వివరాలు
భారత వాతావరణ శాఖలో మొత్తం 134 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ (I, II, III, E) పోస్టులున్నాయి. 25 సైంటిఫిక్ అసిస్టెంట్, 2 అడ్మిన్ అసిస్టెంట్ పోస్టులుపోగా మిగతావన్ని ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులే.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 24 నవంబర్ 2025
దరఖాస్తు చివరి తేదీ: 14 డిసెంబర్ 2025
విద్యార్హతలు
సాధారణంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు ఎమ్మెస్సి/బిటెక్/బిఈ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, మెటియరాలజీ, అట్మాస్ఫియరిక్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి రంగాల్లో) కనీసం 60% మార్కులతో పాస్ అవ్వాలి.
ఉన్నత స్థాయి పోస్టులకు పిహెచ్డి /ఎంటెక్/ఎంఈ వంటి ఉన్నత చదువులతో పాటు పని అనుభవం అవసరం.
సైంటిఫిక్ అసిస్టెంట్‌కు బిఎస్సి ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ /ఐటీ/ కంప్యూటర్ సైన్స్ లాంటి రంగాల్లో డిగ్రీ అవసరం. అడ్మిన్ అసిస్టెంట్‌కు ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో ఉత్తీర్ణత ఉండాలి.
ఒక్కో పోస్టుకు ఒక్కో రకం విద్యార్హతలు అవసరం. ఎక్కువగా M.Sc / B.E / B.Tech అర్హత ఉన్నవారికి ఈ అవకాశం ఉంది.
దరఖాస్తు
దరఖాస్తు ప్రక్రియ :
ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు 24.11.2025 నుంచి 14.12.2025 వరకు అధికారిక వెబ్‌సైట్ https://mausam.imd.gov.in/ లో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు, అభ్యర్థులు తమ అర్హత, వయోపరిమితి, విద్యా అర్హతలతో పాటు అన్ని వివరాలను నోటిఫికేషన్‌లో చూసుకోవాలి.
దరఖాస్తు విధానం :
అధికారిక వెబ్‌సైట్ mausam.imd.gov.in కి వెళ్ళాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపాలి. విద్యా సమాచారం, అనుభవం, పత్రాలను సరిగ్గా జతచేయాలి. చివరి తేదీకి ముందే దరఖాస్తును సమర్పించాలి.
వయోపరిమితి (14.12.2025 నాటికి)
ప్రాజెక్ట్ సైంటిస్ట్ E – 50 ఏళ్లు
ప్రాజెక్ట్ సైంటిస్ట్ III – 45 ఏళ్లు
ప్రాజెక్ట్ సైంటిస్ట్ II – 40 ఏళ్లు
ప్రాజెక్ట్ సైంటిస్ట్ I – 35 ఏళ్లు
సైంటిఫిక్ అసిస్టెంట్ – 30 ఏళ్లు
అడ్మిన్ అసిస్టెంట్ – 30 ఏళ్లు
వయసులో సడలింపు
SC/ST – +5 ఏళ్లు
OBC – +3 ఏళ్లు
PwBD – +10/+13/+15 ఏళ్లు
మాజీ సైనికులు – ప్రభుత్వ నిబంధనల ప్రకారం
ఎంపిక విధానం
ఎలాంటి పోటీ పరీక్ష ఉండదు.... కేవలం షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేస్తారు. అర్హత ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
సాలరీ
ప్రాజెక్ట్ సైంటిస్ట్ E – ₹1,23,100 + HRA
ప్రాజెక్ట్ సైంటిస్ట్ III – ₹78,000 + HRA
ప్రాజెక్ట్ సైంటిస్ట్ II – ₹67,000 + HRA
ప్రాజెక్ట్ సైంటిస్ట్ I – ₹56,000 + HRA
సైంటిఫిక్ అసిస్టెంట్ – ₹29,200 + HRA
అడ్మిన్ అసిస్టెంట్ – ₹29,200 + HRA
గమనిక : ఈ ఉద్యోగాలు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటాయి. అవసరాన్ని బట్టి కాలాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది.