MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Andhra Pradesh
  • జగన్ కు రేణూదేశాయ్ కౌంటర్: పవన్ క‌ళ్యాణ్ కు బిగ్ రిలీఫ్

జగన్ కు రేణూదేశాయ్ కౌంటర్: పవన్ క‌ళ్యాణ్ కు బిగ్ రిలీఫ్

Renu Desai: తన విషయంలో పవన్ చేసింది తప్పేనని సంచలన వ్యాఖ్యలు చేసిన రేణూ దేశాయ్.. "ప‌వన్ డబ్బు మనిషి కాదు.. సమాజం, పేదలకు మంచి చేయాలనుకుంటున్నారు.. రాజ‌కీయంగా ప‌వ‌న్ కు త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని" వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే విష‌యం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్ర‌తిసారి ప‌వ‌న్ ఇర‌కాటంలో ప‌డేసి విష‌యాల్లో ఆయ‌న మూడు పెళ్లిళ్ల అంశం ఉంటుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Aug 10 2023, 06:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప‌వ‌న్ టార్గెట్ చేసేవాళ్లు మొద‌ట పెళ్లి ప్ర‌స్తావ‌న‌తోనే విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఈ విష‌యంలో అధికార పార్టీ నేత‌లు ఇప్ప‌టికే ప‌లుమార్లు ఘాటు వ్యాఖ్యల‌తో విరుచుకుప‌డ్డారు. అయితే, ఇప్పుడు ప‌వ‌న్ మాజీ భార్య రేణూదేశాయ్ మ‌రోసారి మూడు పెళ్లిళ్ల విష‌యం లేవ‌నెత్త‌వ‌ద్దంటూ.. ప‌వ‌న్ కు రాజ‌కీయ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని వ్యాఖ్యానించ‌డమ‌నేది జ‌న‌సేన అధినేత‌కు ఊర‌ట క‌లిగించే అంశం. ఇది ఒక రకంగా పవన్ కల్యాణ్ కు నైతిక బలం చేకూర్చినట్లయింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రేణూదేశాయి త‌న పోస్టులో రాజకీయంగా తన మద్ధతు పవన్ కు ఉంటుంద‌ని తెలిపారు. తన విషయంలో పవన్ చేసింది తప్పేనని పేర్కొన్నారు. ప‌వ‌న్ కు పెద్ద రిలీఫ్ క‌లిగించ‌డంతో పాటు ఆయ‌న రాజ‌కీయంగా మైలేజీని పెంచేలా..  పవన్ డబ్బు మనిషి కాదని.. సమాజం, పేదలకు మంచి చేయాలనుకుంటారని రేణూ దేశాయ్ అన్నారు.  అందుకోసమే కుటుంబాన్ని సైతం పక్కనబెట్టారని ఆమె ప్రశంసించారు. ఈ వ్యాఖ్య‌లు వైఎస్ఆర్సీపీ తో పాటు సీఎం జ‌గ‌న్ కు కౌంట‌ర్ గా భావించ‌వ‌చ్చు. ఎందుకంటే ప‌లుమార్లు జ‌గ‌న్ సైతం పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. 
 

36
ys jagan

ys jagan

సీఎం జగన్ ఒక కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ప‌వ‌న్ వ్యక్తిగ‌త విష‌యాలు ప్ర‌స్తావించారు. ద‌త్త‌పుత్రుడు, ప్యాకేజీ స్టార్, రౌడీలా అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న‌లా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని నాలుగేళ్ల‌కు భార్య‌ను మార్చ‌లేము.. పెళ్లి అనే ప‌విత్ర వ్య‌వ‌స్థ‌ను రోడ్డుమీద‌కు తీసుకురాలేమంటూ వ్యాఖ్యానించారు. 

46
Pawan Kalyan's ex-wife renu desai revealed the painful facts of her heart problem

Pawan Kalyan's ex-wife renu desai revealed the painful facts of her heart problem

మూడు పెళ్ళిళ్లు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, రౌడీ అంటూ టార్గెట్ చేసిన ప్ర‌తిసారి పవన్ కౌంటర్ అటాక్ చేస్తున్నా వైకాపా నేత‌లు మాత్రం ఈ విష‌యంలో వెన‌క్కిత‌గ్గ‌డం లేదు. అయితే, ఇప్పుడు రేణూ దేశాయ్ మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపాలంటూ వైసీపీ గురించి ప్ర‌స్తావించ‌కుండా ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ కు కౌంట‌రిచ్చారు.
 

56

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు ఎన్న‌డూ లేని విధంగా తారాస్థాయికి చేరుకున్నాయి. రాజ‌కీయాలంటే అస‌హ్యించుకునే విధంగా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు త‌గ‌వ‌నే ముచ్చ‌ట వ‌స్తున్నా... దానికి అదుపులేకుండా పోయింది. ప‌వ‌న్ సైతం వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు మాని రాజ‌కీయంగా పోటీకి రండి అంటూ ప‌లుమార్లు వైసీపీని టార్గెట్ చేశారు. ఇప్పుడు రేణూదేశాయి ప‌వ‌న్ కు స‌పోర్టు చేస్తూ.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. వైసీసీ అండ్ సీఎం జ‌గ‌న్ కు కౌంట‌రిస్తూ.. పిల్లలను, కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని అన్నారు. తన పిల్లలనే కాదు.. ఎవరి పిల్లలను ఇందులోకి లాగొద్దని రేణూ దేశాయ్ పేర్కొన్నారు.

66
Janasena Party Formation Day

Janasena Party Formation Day

మొత్తంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అనుకూలంగా రేణూదేశాయ్ చేసిన‌ ఈ వ్యాఖ్య‌లు జ‌న‌సేన అధినేత‌కు పెద్ద రిలీఫ్ క‌లిగించాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇదే స‌మ‌యంలో అధికార పార్టీ నాయ‌కుడు సీఎం జ‌గన్ కు చుర‌క‌లంటించ‌డం రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడే ముందు కాస్తా ఆలోచించాల్సిన పరిస్థితిని ఆయన రాజకీయ ప్రత్యర్థులకు రేణూ దేశాయ్ కల్పించారు.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పవన్ కళ్యాణ్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
రాజకీయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Recommended image2
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?
Recommended image3
Now Playing
చెంచాగాళ్లెవరు లోకేష్ పై రెచ్చిపోయిన పేర్ని నాని | Perni Nani Sensational Comments on Nara Lokesh
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved