MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • 'పుష్ప 2' మ్యూజిక్ ఇష్యూ: స్టేజీపైనే దేవిశ్రీ ప్రసాద్ నిర్మాతపై షాకింగ్ కామెంట్స్

'పుష్ప 2' మ్యూజిక్ ఇష్యూ: స్టేజీపైనే దేవిశ్రీ ప్రసాద్ నిర్మాతపై షాకింగ్ కామెంట్స్

పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించినప్పటికీ, నేపథ్య సంగీతం కోసం ఇతర సంగీత దర్శకులను తీసుకురావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్ తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు.

3 Min read
Author : Surya Prakash
Published : Nov 25 2024, 06:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Devi Sri Prasad, Pushpa 2 , allu arjun, sukumar

Devi Sri Prasad, Pushpa 2 , allu arjun, sukumar


'పుష్ప ది రూల్' సంగీతం విషయంలో గొడవలు జరిగాయనే విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, చిత్ర దర్శకుడు  సుకుమార్, ‌ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మధ్య మంచి ప్రెండ్షిప్ ఉంది. వాళ్ల కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్.

ఈ  టైమ్ లో దేవి శ్రీని తప్పించి మరొక సంగీత దర్శకుడిని నేపథ్య సంగీతం అందించడం కోసం ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. నిర్మాత ఒత్తిడి వల్లే మరొక 'పుష్ప 2 ది రూల్' చిత్రానికి తమన్ నేపథ్య సంగీతం అందించడానికి వచ్చారని చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో  చెన్నైలో జరిగిన కార్యక్రమంలో స్టేజి మీద దేవి శ్రీ ప్రసాద్ ఓపెన్ అయ్యారు, దేవి ఏం అన్నారు? అనే వివరాల్లోకి వెళితే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Devi Sri Prasad

Devi Sri Prasad


అల్లు అర్జున్‌ ( Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). రష్మిక (Rashmika) హీరోయిన్‌. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర టీమ్ లియో ముత్తు ఇండోర్‌ స్టేడియంలో వేడుక (Pushpa 2 The Rule Wildfire Event) నిర్వహించింది. అల్లు అర్జున్‌, రష్మిక, శ్రీలీల (Sree Leela), సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ తన అసహనాన్ని దేవి నవ్వుతూనే బయిటపెట్టేసారు. ఎవరు ఏమనుకున్నా సరే..తగ్గేదేలే అన్న రీతిలో స్టేజిపై నిర్మాతలకు కౌంటర్ వేసారు.

36
Devi Sri Prasad

Devi Sri Prasad


పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం దేవిని ప‌క్క‌న పెట్టి త‌మ‌న్‌, అజ‌నీష్ లోక్ నాథ్ శ్యామ్ లను రంగంలోకి దింపింది మైత్రీ బ్యానర్.  దేవిశ్రీ ప్ర‌సాద్ స‌మ‌యానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వ‌లేద‌ని, అందువ‌ల్ల మ‌రో ముగ్గుర్ని తీసుకోవాల్సివ‌చ్చింద‌ని చిత్ర‌ టీమ్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది

 అయితే తాను సింగిల్ గా చేయాల్సిన ప‌ని మ‌రొక‌రికి అప్ప‌గించ‌డం దేవికి న‌చ్చ‌లేదు,నచ్చదు అనేది నిజం. సుకుమార్ కూడా నిర్మాత‌ల్ని కాద‌న‌లేక‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్య‌త‌ల్ని భాగాలుగా షేర్ చేసి, మ‌రో ముగ్గురికి అప్ప‌గించారు. 

46


అయితే దేవిశ్రీ త‌న వంతుగా సినిమాకు ఆర్‌.ఆర్ ఇచ్చుకొంటూ వెళ్లాడ‌ని, దేవిశ్రీ ఇచ్చిన వెర్ష‌నే ఫైన‌ల్ కాపీలో వినే అవ‌కాశం ఉంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే… దేవిశ్రీ‌కి మైత్రీ మూవీస్ పై ఉన్న అస‌హ‌నం మాత్రం త‌గ్గ‌లేదు. అది చెన్నైలో జ‌రిగిన‌ ఈవెంట్ లో కనిపించింది.''మనకు ఏం కావాలన్నా అది అడిగి తీసుకోవాఐ. నిర్మాత దగ్గర పేమెంట్ అయినా సరే స్క్రీన్ మీద పేరు అయినా సరే''  అంటూ స్పీచ్ అదరకొట్టేసారు.

56

దేవిశ్రీ (Devi Sri Prasad) మాట్లాడుతూ.. ‘‘పుష్ప’ మా అందరికీ ప్రత్యేకం. మనకు ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలి. నిర్మాతలు ఇచ్చే పారితోషికమైనా తెరపై మన పేరైనా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కరెక్టే కదా బన్నీ? (అల్లు అర్జున్‌). ఫైనల్‌ మిక్సింగ్‌ పనుల్లో సుకుమార్‌ బిజీగా ఉండడంతో ఇక్కడికి రాలేకపోయారు.

ఈ సినిమా కథ, బన్నీ నటన మరో స్థాయిలో ఉంటాయి. నేను ఫస్టాఫ్‌కే ఫిదా అయిపోయా. ఈ చిత్రం కోసం సుకుమార్‌, బన్నీ ఎంతో కష్టపడ్డారు. త్వరలోనే మరో పాట విడుదల కానుంది. అందులో బన్నీ ఊర మాస్‌ స్టెప్పులు చూస్తారు. చాలా మంది హీరోయిన్లు డ్యాన్స్‌ చేసిన తొలి స్పెషల్‌ సాంగ్‌కు నేను మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావడం విశేషం. 

66

ఈ క్రెడిట్‌ ఏ సంగీత దర్శకుడికీ లేదు. రవిశంకర్‌ (నిర్మాత) సర్‌.. నేను వేదికపై ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనొద్దు. ఎందుకంటే.. నేను టైమ్‌కి పాట ఇవ్వలేదు, టైమ్‌కి బ్యాక్‌గ్రౌండ్‌ లేదు, టైమ్‌కి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటుంటారు (నవ్వుతూ). మీకు నాపై చాలా ప్రేమ ఉంది. కానీ, ప్రేమ ఉంటే ఫిర్యాదులు కూడా ఉంటాయి.

నా విషయంలో మీకు కంప్లైట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంగణంలోకి వచ్చేటప్పుడూ రాంగ్‌ టైమింగ్‌ అన్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్‌ ఉండదు. ఇలా ఓపెన్‌గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేనెప్పుడూ ఆన్‌ టైమ్‌ సర్‌’’ అని అన్నారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్
Recommended image2
Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ
Recommended image3
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved