MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • El Nino Effect: ఏపీ, తెలంగాణకు ఎల్ నినో సెగ.. ఈ ఏడాది వర్షాలు పడవా? పసిఫిక్‌ కు భారత వర్షాలకు సంబంధమేంటి?

El Nino Effect: ఏపీ, తెలంగాణకు ఎల్ నినో సెగ.. ఈ ఏడాది వర్షాలు పడవా? పసిఫిక్‌ కు భారత వర్షాలకు సంబంధమేంటి?

El Nino Impact on Indian: నైరుతి రుతుపవనాలు వచ్చి దాదాపు రెండు వారాల పైనే అవుతోంది. కానీ, పెద్దగా వానలు పడటం లేదు. దీనికి కారణమైన పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో ప్రభావం భారత్‌తో పాటు తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండబోతోంది? 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 19 2026, 07:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
పసిఫిక్ సముద్రంలో ముదురుతున్న 'ఎల్ నినో' సెగ
Image Credit : Gemini

పసిఫిక్ సముద్రంలో ముదురుతున్న 'ఎల్ నినో' సెగ

పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరిగే 'ఎల్ నినో' మార్పులు, భారతదేశంలో కురిసే రుతుపవన వర్షాలను శాసిస్తున్నాయంటే మీరు నమ్ముతారా? కానీ, ఇది నిజం. అదే జరుగుతోంది. దీని వెనుక బలమైన వాతావరణ సైన్స్ ఉంది. భూమిపై వాతావరణం, సముద్ర ప్రవాహాలు అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. దీనినే సైన్స్ భాషలో టెలికనెక్షన్ అంటారు.

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వాకర్ సర్క్యులేషన్ అనే గాలి చక్రం భారత్ వరకు విస్తరించి ఉంటుంది. ప్రస్తుత నైరుతి రుతుపవనాల పై ఈ ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ వాతావరణ సంస్థలతో పాటు భారత వాతావరణ శాఖ (IMD) శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ కీలక హెచ్చరికలు జారీ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అసలు ఎల్ నినో అంటే ఏంటి? పసిఫిక్ సముద్రంలో ఏం జరుగుతుంది?
Image Credit : Asianet News

అసలు ఎల్ నినో అంటే ఏంటి? పసిఫిక్ సముద్రంలో ఏం జరుగుతుంది?

ఎల్ నినో (El Nino) అనేది పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఒక ముఖ్యమైన వాతావరణ మార్పు ప్రక్రియ. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయి.

సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో వీచే గాలులు వేడి నీటిని ఆసియా వైపు నెడతాయి. కానీ, ఎల్ నినో సమయంలో ఈ గాలులు బాగా బలహీనపడతాయి. దీనివల్ల మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు సాధారణం కంటే చాలా వేడిగా మారుతుంది. ఇవి భారత వాతావరణం పై ప్రభావం చూపుతాయి.

Related Articles

Related image1
Water Bar Trend: పెళ్లిళ్లలో సరికొత్త క్రేజ్.. మందు బార్లకు పోటీగా వస్తున్న వాటర్ బార్స్! అసలు ఏంటివి?
Related image2
Weather Update: ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఒకేసారి ఎండలు, వానలు
37
గ్లోబల్ కనెక్షన్ తలకిందులు.. భారత రుతుపవనాలకు ఎందుకు ముప్పు?
Image Credit : Ai

గ్లోబల్ కనెక్షన్ తలకిందులు.. భారత రుతుపవనాలకు ఎందుకు ముప్పు?

సాధారణ రోజుల్లో పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ భాగంలో (ఆస్ట్రేలియా, ఇండోనేషియా వైపు) వేడి నీరు, తూర్పు భాగంలో (పెరూ తీరం వైపు) చల్లని నీరు ఉంటుంది. ఆసియా ప్రాంతంలో ఉండే ఈ వేడి వాతావరణం వల్ల గాలి పైకి లేచి, అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది భారత రుతుపవన గాలులను బలంగా మనవైపు లాక్కోవడానికి హెల్ప్ అవుతుంది.

కానీ ఎల్ నినో సమయంలో ఈ సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. పసిఫిక్ మహాసముద్రం మధ్య, తూర్పు భాగం (అమెరికా వైపు) విపరీతంగా వేడెక్కుతుంది. దీనివల్ల గాలి పైకి లేచే కేంద్రం అంటే అల్పపీడన ప్రాంతం ఆసియా నుండి అమెరికా వైపు షిఫ్ట్ అయిపోతుంది. దీనివల్ల భారతదేశం వైపు రావాల్సిన చల్లని, తేమతో కూడిన గాలుల ప్రవాహం పూర్తిగా వీక్ అవుతుంది.

47
తీవ్రమైన వడగాల్పులు, కరవు పరిస్థితులు.. గడిచిన వందేళ్ల చరిత్ర ఇదే
Image Credit : 2026 Heatwave In India Extreme North India Summer Hot Weather IMD Alert Delhi temperature to rise Mega El Nino Fears

తీవ్రమైన వడగాల్పులు, కరవు పరిస్థితులు.. గడిచిన వందేళ్ల చరిత్ర ఇదే

సముద్రం వేడెక్కడం వల్ల గ్లోబల్ వాతావరణ చక్రం దెబ్బతింటుంది. అమెరికా వంటి దేశాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే... ఆస్ట్రేలియా, ఇండోనేషియా, భారత్ వంటి ప్రాంతాలలో తీవ్రమైన వేడి, పొడి వాతావరణం నెలకొంటుంది. ఎల్ నినో వల్ల భారతదేశంలో ప్రధానంగా కింది మార్పులు సంభవిస్తాయి..

  • బలహీనపడే రుతుపవనాలు: భారతదేశానికి జీవనాధారమైన నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయి. దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే చాలా తగ్గుతుంది. గత వందేళ్ల చరిత్రను పరిశీలిస్తే, భారత్‌లో ఏర్పడిన తీవ్రమైన కరవులలో దాదాపు 80% కరవులు ఎల్ నినో సంవత్సరాల్లోనే వచ్చాయి.
  • ఎండ తీవ్రత, హీట్ వేవ్స్: వర్షాలు తగ్గడమే కాకుండా, ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. మార్చి నుండి జూన్ మధ్య కాలంలో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయి. శీతాకాలంలో కూడా చలి తీవ్రత తగ్గి, ఎక్కువ వేడిగా ఉంటుంది. పగటితో పాటు రాత్రి పూట కూడా ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
57
అగ్రికల్చర్, ఎకానమీపై గట్టి దెబ్బ.. నీటి కొరత ముప్పు
Image Credit : our own

అగ్రికల్చర్, ఎకానమీపై గట్టి దెబ్బ.. నీటి కొరత ముప్పు

భారతీయ వ్యవసాయం ఎక్కువగా రుతుపవన వర్షాలపైనే ఆధారపడి నడుస్తుంది. ఎల్ నినో వల్ల వర్షాలు టైంకి పడక, పడినా తక్కువగా ఉండటం వల్ల ఖరీఫ్ పంటలు, ఎక్కువగా వరి, సోయాబీన్, పత్తి, చెరకు వంటివి తీవ్రంగా దెబ్బతింటాయి. ఇది దేశంలో ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోవడానికి కారణమవుతుంది.

పంటల దిగుబడి తగ్గితే మార్కెట్‌లో ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి, సామాన్యుడిపై ఆర్థిక భారం పడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగిస్తుంది. వర్షాలు లేకపోవడం వల్ల నదులు, జలాశయాలు, డ్యాములలో నీటి మట్టాలు అడుగున పడతాయి. ఇది తాగునీటి ఎద్దడికి, జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గడానికి దారితీస్తుంది.

అయితే, ఎల్ నినో వచ్చిన ప్రతిసారీ భారత్‌లో 100% తీవ్ర కరవు వస్తుందని చెప్పలేం. హిందూ మహాసముద్రంలో ఏర్పడే 'ఇండియన్ ఓషన్ డైపోల్' వంటి లోకల్ వాతావరణ అంశాలు అనుకూలంగా ఉంటే, అవి ఎల్ నినో ప్రభావాన్ని కొంతవరకు కంట్రోల్ చేయగలవు.

67
తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
Image Credit : AI

తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

రుతుపవనాలు జూన్ రెండో వారానికల్లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు ఎంటర్ అయినప్పటికీ... ఎల్ నినో ప్రభావం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది.

తెలంగాణ పరిస్థితి: జూన్ మధ్య నాటికి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం వరకు విస్తరించినప్పటికీ, ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు కురవడం లేదు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వానలు పడుతున్నా, సిస్టమాటిక్ గా కురవాల్సిన రుతుపవన వర్షాలు తక్కువగానే ఉన్నాయి. జూన్ మూడో వారంలో కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి: ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రుతుపవనాలు ప్రవేశించినా వర్షాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ నెలలో కురవాల్సిన సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షాలు నమోదవుతున్నాయి. కోస్తా జిల్లాలలో గాలిలో తేమ శాతం పెరిగి ఉక్కపోత తీవ్రంగా ఉంది. ఎల్ నినో కారణంగా జూన్ చివరి వరకు ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్ రోజులు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది

77
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Image Credit : our own

రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం ఎక్కువగా ఈ నైరుతి రుతుపవనాల పైనే ఆధారపడి ఉంటుంది. ఎల్ నినో వల్ల వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాతావరణ నిపుణులు, వ్యవసాయ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. వర్షాలు పూర్తిగా సెట్ అయ్యే వరకు ఖరీఫ్ పంటల విత్తనాలు వేయడంలో తొందరపడకూడదు. తక్కువ నీటితో, తక్కువ రోజుల్లో చేతికి వచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం మంచిది. అవైలబుల్ గా ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేందుకు వీలుగా డ్రిప్ లేదా స్ప్రింక్లర్ పద్ధతులను ప్లాన్ చేసుకోవాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nara Lokesh Speech: ఐసిసి ప్లీనరీ సమావేశంలోనారా లోకేష్ అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
Recommended image2
Now Playing
Minister Nara Lokesh Pressmeet: కోల్‌కతాలో మీడియాతో మంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
Recommended image3
Now Playing
AP Food Commission Chairman: అధికారికి వార్నింగ్ ఇచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet News Telugu
Related Stories
Recommended image1
Water Bar Trend: పెళ్లిళ్లలో సరికొత్త క్రేజ్.. మందు బార్లకు పోటీగా వస్తున్న వాటర్ బార్స్! అసలు ఏంటివి?
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఒకేసారి ఎండలు, వానలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved