MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Water Bar Trend: పెళ్లిళ్లలో సరికొత్త క్రేజ్.. మందు బార్లకు పోటీగా వస్తున్న వాటర్ బార్స్! అసలు ఏంటివి?

Water Bar Trend: పెళ్లిళ్లలో సరికొత్త క్రేజ్.. మందు బార్లకు పోటీగా వస్తున్న వాటర్ బార్స్! అసలు ఏంటివి?

Water Bar Trend: లగ్జరీ పెళ్లిళ్లలో మందు బార్లకు పోటీగా వాటర్ బార్స్ వస్తున్నాయి. అసలు ఏమిటి ఈ వాటర్ బార్స్? రూ.800 వాటర్ బాటిల్స్ క్రేజ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 19 2026, 08:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెళ్లిళ్లలో నయా ట్రెండ్.. విరాట్ కోహ్లీ తాగే నీళ్లకు మించిన లగ్జరీ.. ఏంటో తెలుసా?
Image Credit : Gemini

పెళ్లిళ్లలో నయా ట్రెండ్.. విరాట్ కోహ్లీ తాగే నీళ్లకు మించిన లగ్జరీ.. ఏంటో తెలుసా?

సాధారణంగా పెళ్లి అనగానే రకరకాల వంటకాలు, కాక్‌టెయిల్స్, మాక్టెయిల్స్, మందు బాటిళ్ల కౌంటర్లు గుర్తుకొస్తాయి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ధనవంతుల పెళ్లిళ్లలో మందు బార్లకు గట్టి పోటీ ఇస్తూ సరికొత్తగా ‘వాటర్ బార్స్’ (Water Bars) ఎంట్రీ ఇస్తున్నాయి. "ఏంటి.. నీళ్లు తాగడానికి కూడా ఒక బార్ పెట్టాలా? దాహం వేస్తే నార్మల్ వాటర్ తాగేస్తే పోలా" అని అనుకుంటే మీరు పొరబడినట్లే! ఎందుకంటే ఇప్పుడు లగ్జరీ పెళ్లిళ్లలో ఈ వాటర్ బార్స్ ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. అసలు ఏంటి ఈ వాటర్ బార్స్? వీటి వెనుక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోషల్ మీడియాలో సెన్సేషన్.. నీళ్ల కోసం స్పెషల్ కౌంటర్
Image Credit : Gemini

సోషల్ మీడియాలో సెన్సేషన్.. నీళ్ల కోసం స్పెషల్ కౌంటర్

ఇటీవల ప్రముఖ కంటెంట్ క్రియేటర్ సాక్షి శివదాసాని ఒక పాడ్‌కాస్ట్‌లో షేర్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తను వెళ్లిన ఒక లగ్జరీ పెళ్లిలో ఎలాంటి ఆల్కహాల్, సోడాలు లేవట.. కేవలం ఒక రిచ్ ‘వాటర్ బార్’ మాత్రమే ఉందట. అక్కడ గ్లేసియర్ వాటర్, స్ప్రింగ్ వాటర్, నేచురల్ మినరల్ వాటర్ అంటూ రకరకాల లగ్జరీ వాటర్ బాటిల్స్ పెట్టారు.

ఆ పెళ్లికొడుకు ఫ్రెండ్స్ అంతా ‘డ్రై ఏప్రిల్’ అంటే నెల రోజుల పాటు మందుకు దూరంగా ఉండటం ఫాలో అవుతుండటంతో, వారందరికీ ఈ వాటర్ బార్ ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందని ఆమె చెప్పింది. ఈ కాలం పెళ్లిళ్లలో ఐవీ డ్రిప్స్, భజన క్లబ్బింగ్ లాంటి వింత ట్రెండ్స్ వస్తున్న తరుణంలో, ఈ వాటర్ బార్ కాన్సెప్ట్ సెలబ్రిటీలను విపరీతంగా ఆకర్షిస్తోంది.

Related Articles

Related image1
Marriage Secrets : పెళ్లిలో వధువు ఎప్పుడూ వరుడికి ఎడమ వైపే ఎందుకు కూర్చుంటుంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే !
Related image2
IRCTC Hyderabad to Ooty Tour: హైదరాబాద్ టూ ఊటీ మస్త్ ట్రిప్.. బడ్జెట్ లోనే ఐఆర్‌సీటీసీ క్రేజీ ప్యాకేజీ డీటెయిల్స్ ఇవే
35
వైన్ లాగే ‘వాటర్ టేస్టింగ్’.. ఒక్కో నీటిది ఒక్కో టేస్ట్
Image Credit : Gemini

వైన్ లాగే ‘వాటర్ టేస్టింగ్’.. ఒక్కో నీటిది ఒక్కో టేస్ట్

మనం వైన్ టేస్టింగ్ గురించి వినే ఉంటాం, కానీ ఇప్పుడు వాటర్ టేస్టింగ్ కూడా ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. దీని కోసం వాటర్ సొమెలియర్స్ కూడా ఉన్నారు. ‘ఆవా నేచురల్ మినరల్ వాటర్’ బ్రాండ్ మేనేజర్ అవంతి మెహతా దీనిపై క్లారిటీ ఇస్తూ.. "మనం తాగే నార్మల్ ప్యాకేజ్డ్ వాటర్ అనేది మిషన్ల ద్వారా ఆర్ఓ ప్రాసెస్ చేసి, అందులో మినరల్స్ అన్నీ తీసేసి తయారు చేస్తారు. కానీ నేచురల్ మినరల్ వాటర్ అలా కాదు.. భూగర్భంలోని సహజ వనరుల నుండి మినరల్స్ అస్సలు దెబ్బతినకుండా నేరుగా బాటిల్స్‌లో నింపుతారు. ఇది వైన్ లాగే ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్" అని చెప్పారు. నీటిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం ఆధారంగా నీటి టేస్ట్ మారుతుందని నిపుణులు కూడా పేర్కొంటున్నారు.

రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. ‘ఫుడ్‌స్టోరీస్’ కో-ఫౌండర్ అవ్ని బియానీ తమ స్టోర్లలో ప్రీమియం వాటర్ సేల్స్ 2025లో ఏకంగా మూడు రెట్లు పెరిగాయని తెలిపారు. న్యూయార్క్ నుండి ఇంపోర్ట్ చేసిన ‘సరటోగా స్ప్రింగ్ వాటర్’ బాటిల్ ధర అక్షరాలా రూ. 799 ఉన్నప్పటికీ, స్టాక్ వచ్చిన కొన్ని రోజుల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి. అంటే జనాలు ఎంత రేటైనా పెట్టి ఈ లగ్జరీ వాటర్ తాగడానికి ఇష్టపడుతున్నారని చెప్పవచ్చు.

45
వెడ్డింగ్ ప్లానర్స్ ప్లాన్ ఏంటి? పెళ్లిళ్లలో ఇది ఎలా ఉంటుంది?
Image Credit : Gemini

వెడ్డింగ్ ప్లానర్స్ ప్లాన్ ఏంటి? పెళ్లిళ్లలో ఇది ఎలా ఉంటుంది?

అసలు ఈ వాటర్ బార్స్ పెళ్లిళ్లలో ఎలా పని చేస్తాయి? పుణెకు చెందిన ‘క్యూ ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్’ ఫౌండర్ దామిని ఒబెరాయ్ ఒక మీడియా ఛానెల్ తో దీనిపై మాట్లాడుతూ.. "వాటర్ బార్ అనేది గెస్టులకు ఒక లగ్జరీ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పీరియన్స్. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి సేకరించిన ప్రీమియం వాటర్స్, స్పార్క్లింగ్ వాటర్, ఆర్టీషియన్ వాటర్స్ ఇందులో ఉంటాయి. ఇది పెళ్లికి వచ్చే గెస్టులకు ఒక యూనిక్ ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా హెల్త్ కాన్షియస్, వెల్‌నెస్ థీమ్ ఉండే డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ఇది పర్ఫెక్ట్" అని చెప్పారు. ‘బస్ పానీ’ కో-ఫౌండర్ అర్చిత్ సాహు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పెళ్లికి వచ్చే ప్రతి ఒక్కరూ మందు తాగరు, కాబట్టి అలాంటి వారికి ఈ వాటర్ బార్స్ ఒక సరికొత్త రాయల్ ట్రీట్ లాంటివని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

55
సెలబ్రిటీల ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్‌కు బిజినెస్
Image Credit : X/@prideof_gypsi3s

సెలబ్రిటీల ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్‌కు బిజినెస్

ఇంతకాలం "రూ. 300 పెట్టి వాటర్ బాటిల్ ఎవరు కొంటారు బాస్?" అని లైట్ తీసుకున్న వాళ్లంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తన సోదరి సమీక్షా పెడ్నేకర్‌తో కలిసి ‘బ్యాక్‌బే’ (Backbay) అనే లగ్జరీ వాటర్ బ్రాండ్‌ను స్టార్ట్ చేసింది. ఇది హిమాలయాల నుండి తెచ్చిన నేచురల్ మినరల్ వాటర్‌ను అమ్ముతోంది. అలాగే హాలీవుడ్ స్టార్ జేసన్ మోమోవా కూడా ‘మనానాలు’ (Mananalu) అనే సస్టైనబుల్ వాటర్ బిజినెస్‌ను ప్రమోట్ చేస్తున్నాడు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samiksha Satish Pednekar (@samikshapednekar)

కాబట్టి, ఇకపై మీరు ఏదైనా రిచ్ పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ మందు కౌంటర్ల పక్కన గ్రాండ్‌గా డిజైన్ చేసిన ‘వాటర్ బార్స్’ కనిపిస్తే అస్సలు షాక్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు ఇదే నయా లగ్జరీ ట్రెండ్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC Hyderabad to Ooty Tour: హైదరాబాద్ టూ ఊటీ మస్త్ ట్రిప్.. బడ్జెట్ లోనే ఐఆర్‌సీటీసీ క్రేజీ ప్యాకేజీ డీటెయిల్స్ ఇవే
Recommended image2
మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? చావు అంచులదాకా వెళ్లి బతికినోళ్లు చెప్పే షాకింగ్ నిజాలు
Recommended image3
నలుపు రంగు పాలిచ్చే జంతువు ఏదో తెలుసా.? 90 శాతం మందికి ఈ స‌మాధానం తెలిసి ఉండ‌దు
Related Stories
Recommended image1
Marriage Secrets : పెళ్లిలో వధువు ఎప్పుడూ వరుడికి ఎడమ వైపే ఎందుకు కూర్చుంటుంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే !
Recommended image2
IRCTC Hyderabad to Ooty Tour: హైదరాబాద్ టూ ఊటీ మస్త్ ట్రిప్.. బడ్జెట్ లోనే ఐఆర్‌సీటీసీ క్రేజీ ప్యాకేజీ డీటెయిల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved