Weather Update: ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఒకేసారి ఎండలు, వానలు
AP Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. ఏపీలో పిడుగుల హెచ్చరికలు, తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ జారీ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్లైమేట్ చాలా విచిత్రంగా మారిపోయింది. సాధారణంగా జూన్ నెల వచ్చిందంటే వర్షాలు దంచికొట్టాలి కానీ, ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. ఒకే టైమ్‌లో ఇటు ఎండలు, అటు వానలు వస్తూ జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.
హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ వంటి సిటీస్ లో పగటిపూట ఎండలు 40 డిగ్రీల సెల్సియస్ దాటేస్తూ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు ఏపీలోని తీరప్రాంత జిల్లాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో వానలు పడుతున్నాయి. ఎల్ నినో ఎఫెక్ట్ తో పాటు లోకల్ గా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లే ఈ వింత సిట్యువేషన్ క్రియేట్ అయిందని అధికారులు చెబుతున్నారు.
ఏపీలో పిడుగుల అలర్ట్.. ఏపీఎస్డీఎంఏ వార్నింగ్
నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటం, ద్రోణి ప్రభావం వల్ల ఏపీలో రాబోయే ఏడు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ (IMD) క్లారిటీ ఇచ్చింది. అయితే, వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) గట్టిగా హెచ్చరించింది.
అలాగే ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో లైట్ నుండి మోస్తరు వానలు పడొచ్చని అంచనా వేస్తున్నారు.
రైతులకు అలర్ట్
వాతావరణం అకస్మాత్తుగా మారుతున్నందున బయట తిరిగేవాళ్లు చాలా అలర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు, పశువుల కాపరులు పిడుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ఓపెన్ ప్లేస్ లో ఉండటం అస్సలు సేఫ్ కాదు.
చెట్ల కింద, కరెంట్ స్తంభాల పక్కన అస్సలు నిలబడొద్దు. పొలాల్లో ఉన్నవాళ్లు వాతావరణం మారగానే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. పశువులను కూడా చెట్ల కింద కట్టేయకుండా సేఫ్ గా ఉండే షెడ్ లలో ఉంచాలని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణకు ఎల్లో అలర్ట్.. హైదరాబాద్ వాసులకు కూల్ న్యూస్
ఇక తెలంగాణ విషయానికొస్తే, జూన్ 19 రాత్రి నుంచి వాతావరణం స్పీడ్‌గా ఛేంజ్ కాబోతోంది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో స్ట్రాంగ్ ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉండటంతో వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' ప్రకటించింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో కూడా గాలి వానలు పడనున్నాయి. అయితే, ఉత్తర తెలంగాణలో జూన్ 20, 21 తేదీల్లో మధ్యాహ్నం పూట వడగాలులు కూడా వీచే ప్రమాదం ఉంది. కానీ, ఆ తర్వాత రెండు రోజులకు టెంపరేచర్స్ 1 నుండి 2 డిగ్రీలు తగ్గి క్లైమేట్ కూల్ అవుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ తదితర ప్రాంతాల్లో జూన్ 21 నుండి 24 వరకు సూపర్ గా వర్షాలు పడతాయని, దీంతో నగరంలో ఉక్కపోత తగ్గిపోతుందని ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది.

