MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Arnab Cyclone: కొనసాగుతున్న అర్నబ్ తుపాను బీభత్సం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Arnab Cyclone: కొనసాగుతున్న అర్నబ్ తుపాను బీభత్సం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Arnab Cyclone : అర్నాబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా వర్ష ప్రభావం కొనసాగుతుండటంతో 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 29 2026, 08:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన కోస్తా ప్రాంతాలు
Image Credit : Asianet News

అర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన కోస్తా ప్రాంతాలు

అర్నాబ్ అతి తీవ్ర తుపాను కోస్తా జిల్లాలను పూర్తిగా అతలాకుతలం చేసింది. పెను గాలులతో భారీ వృక్షాలు నేలకొరగగా, చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి వరకూ గాలివాన తీవ్రంగా కొనసాగింది.

విశాఖపట్నం సహా తీర ప్రాంతాలను ఈ తుపాను తీవ్రంగా వణికించింది. నరసాపురం వద్ద ల్యాండ్‌ఫాల్ సమయంలో గంటకు 150 కిలోమీటర్ల ప్రచండ వేగంతో ఈదురుగాలులు వీచాయి. గోపాలపట్నంలో ఏకంగా 31.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పాడ తీరంలో సముద్ర అలల తాకితకి రోడ్డుపైకి బండరాళ్లు కొట్టుకొచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అన్నదాతలకు తీవ్ర నష్టం.. నీట మునిగిన లక్షలాది ఎకరాలు
Image Credit : Gemini AI

అన్నదాతలకు తీవ్ర నష్టం.. నీట మునిగిన లక్షలాది ఎకరాలు

ఈ తుపాను కారణంగా కోనసీమ, గోదావరి జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో వరి, అరటి తదితర పంటలు నీట మునిగి రైతుల కష్టమంతా వృథా అయింది. కాకినాడ జిల్లాలో 7 మండలాల్లోని 29 గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షాలు, ఈదురు గాలులకు 78 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతు కాగా, 68 బోట్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో కొన్ని గ్రామాల్లో రెండు రోజులుగా అంధకారం అలుముకుంది.

35
బలహీనపడుతున్నా తగ్గని ముప్పు.. మళ్లీ భారీ వర్షాలు
Image Credit : Gemini AI

బలహీనపడుతున్నా తగ్గని ముప్పు.. మళ్లీ భారీ వర్షాలు

తీరం దాటిన అర్నాబ్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. మధ్యాహ్నానికి తుపానుగా, రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారింది. అయినప్పటికీ దీని ప్రభావం ఇంకా కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. భారీ వర్షాలతో ప్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగిపొర్లే వాగులు దాటొద్దని సూచించారు. సహాయక చర్యల్లో 16 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

45
11 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
Image Credit : Asianet News

11 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

తుపాను తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం రాష్ట్రంలోని 11 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు.

55
తెలంగాణలోనూ వర్షాలు.. రవాణా వ్యవస్థపై ప్రభావం
Image Credit : ai

తెలంగాణలోనూ వర్షాలు.. రవాణా వ్యవస్థపై ప్రభావం

అర్నాబ్ తుపాను ప్రభావం తెలంగాణపై కూడా పడింది. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి వాతావరణం కూల్ అయింది.

మరోవైపు, ప్రతికూల వాతావరణం వల్ల శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులు, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. నవంబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో 10వ నంబర్, విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో 9వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
విశాఖపట్నం
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
School Holidays: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలోని ఆ 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Recommended image2
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. అర్న‌బ్ తుపాను వేళ వారికి రూ. 5 ల‌క్ష‌ల సాయం
Recommended image3
IND W vs ZIM W: మూడో వ‌న్డేలోనూ అద‌ర‌గొట్టిన అమ్మాయిలు.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్
Related Stories
Recommended image1
DA Hike: ఉద్యోగులకు దీపావళి కానుక.. 3 శాతం డిఏ పెంపు.. జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Recommended image2
Moon: అమావాస్య నుంచి పున్నమి వరకు.. అసలు రాత్రిపూట చంద్రుడు ఎందుకు మారుతాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved