MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Moon: అమావాస్య నుంచి పున్నమి వరకు.. అసలు రాత్రిపూట చంద్రుడు ఎందుకు మారుతాడు?

Moon: అమావాస్య నుంచి పున్నమి వరకు.. అసలు రాత్రిపూట చంద్రుడు ఎందుకు మారుతాడు?

Moon Phases: చంద్రుడు ప్రతిరోజూ ఎందుకు మారుతాడో తెలుసా? చంద్రుని దశలు, సూర్యరశ్మి ప్రభావం, భూమి చుట్టూ తిరిగే విధానం ఇలా చాలా విషయాలు జాబిల్లిని ప్రభావితం చేస్తాయి. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 29 2026, 07:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆకాశంలో చంద్రుని మాయాజాలం
Image Credit : chatgpt

ఆకాశంలో చంద్రుని మాయాజాలం

ప్రతిరోజూ రాత్రి పూట ఆకాశంలోకి చూస్తే మనకు ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. అదే చంద్రుని ఆకారంలో వచ్చే మార్పలు. ఏడు రోజులకు ఒకసారి, పది రోజులకు ఒకసారి జాబిల్లి రూపం మారడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

కొన్ని రోజులు నిండు పున్నమిలా వెలిగిపోతే, మరికొన్ని రోజులు సగానికి పడిపోతుంది. అసలు చంద్రుడు ఇలా మారే ఈ అద్భుతం వెనుక ఎలాంటి సైన్స్ దాగి ఉంది? ప్రతిరోజూ రాత్రి చంద్రుడు తన రూపాన్ని ఎందుకు మారుస్తాడో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సూర్యుని వెలుతురే అసలు కారణం
Image Credit : pinterest

సూర్యుని వెలుతురే అసలు కారణం

అసలు నిజం ఏమిటంటే, చంద్రునికి స్వయంగా ఎలాంటి కాంతి ఉండదు. సూర్యుని కిరణాలు చంద్రుని ఉపరితలంపై పడినప్పుడు, ఆ వెలుతురు భూమి వైపు రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడే మనం చంద్రుడిని చూడగలుగుతాం.

చంద్రుడు మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. భూమి చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణ చేయడానికి చంద్రునికి దాదాపు 27.3 రోజులు పడుతుంది. అయితే, అమావాస్య నుంచి మళ్లీ అమావాస్య రావడానికి లేదా అన్ని దశలు పూర్తి కావడానికి మాత్రం 29.5 రోజులు పడుతుంది.

34
చంద్రుని వివిధ దశలు.. అసలు సైన్స్ ఫ్యాక్ట్ ఇదే
Image Credit : Gemini

చంద్రుని వివిధ దశలు.. అసలు సైన్స్ ఫ్యాక్ట్ ఇదే

చంద్రుడు సూర్యునికి, భూమికి మధ్యలోకి వచ్చినప్పుడు, దాని వెలుతురు పడే భాగం భూమికి కనిపించదు. దాన్నే మనం అమావాస్య అంటాం. ఈ సమయంలో జాబిల్లి అసలు కనిపించదు.

అది అలా కొంచెం ముందుకు కదిలినప్పుడు, సన్నని చంద్రవంక లాగా మారుతుంది. దీన్ని 'వెక్సింగ్ క్రిసెంట్' అంటారు. ఆ తర్వాత చంద్రుడు తన ప్రయాణంలో నాలుగో వంతు చేరుకున్నప్పుడు, సగం చంద్రుడు కనిపిస్తాడు. దీన్ని చంద్రుని ఫస్ట్ క్వార్టర్ అంటారు.

ఇక భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక వరుసలోకి వచ్చినప్పుడు పౌర్ణమి లేదా ఫుల్ మూన్ ఏర్పడుతుంది. ఈ రాత్రి జాబిల్లి నిండుగా, అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతుంది.

44
మళ్లీ మొదటికి వచ్చే ప్రయాణం
Image Credit : Chatgpt

మళ్లీ మొదటికి వచ్చే ప్రయాణం

పున్నమి రోజు తర్వాత నుంచి చంద్రుని ప్రకాశించే భాగం క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీన్ని వెనింగ్ మూన్ అని పిలుస్తారు.

ఈ దశలో చంద్రుడు తన ప్రయాణంలోని రెండో భాగాన్ని పూర్తి చేస్తాడు. ఆకారాలు మారుతూ మారుతూ చివరికి మళ్లీ మొదటి స్థానానికి చేరుకుంటాడు.

మళ్లీ సూర్యునికి, భూమికి మధ్యలోకి వస్తాడు. ఈ సమయంలో సూర్యకాంతి భూమి మీద పడదు. దాంతో మళ్లీ అమావాస్య వస్తుంది. ఇలా చంద్రుడు తన ప్రయాణాన్ని నిరంతరం సాగిస్తూనే ఉంటాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
విద్య
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
City of Lakes: మనదేశంలో సిటీ ఆఫ్ లేక్స్‌ అని ఏ నగరాలను పిలుస్తారు?
Recommended image2
Death Valley: నేపాల్‌లో ప్రాణాలు తీస్తున్న కర్ణాలి హైవే.. ప్రయాణం ఎందుకంత ప్రమాదకరం?
Recommended image3
బంగాళాఖాతంలోనే ఎక్కువ తుఫాన్లు ఎందుకు వస్తాయి? అది కూడా ఈ రెండు నెలల్లోనే ఎందుకు ఎక్కువ?
Related Stories
Recommended image1
Instagram: బోరింగ్ ఇన్‌స్టా ప్రొఫైల్‌కి గుడ్ బై చెప్పేయండి.. ఈ సీక్రెట్ టిప్స్‌తో ట్రెండీగా మారండి
Recommended image2
Venomous Monkey: అబ్బా.. ఎంత ముద్దుగా ఉందో అనుకుంటే ప్రాణానికే ముప్పు.. విషపూరిత కోతి ఇది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved