MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Akvan Cyclone: అక్వాన్ తుపాను ముప్పు.. అతిభారీ వర్షాలు.. 145 కి.మీ వేగంతో గాలుల రెడ్ అలర్ట్

Akvan Cyclone: అక్వాన్ తుపాను ముప్పు.. అతిభారీ వర్షాలు.. 145 కి.మీ వేగంతో గాలుల రెడ్ అలర్ట్

Akvan Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. శుక్రవారం కాకినాడ - విశాఖ లేదా నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో కోస్తాంధ్రకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 18 2026, 08:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దూసుకొస్తున్న అక్వాన్ తుపాను
Image Credit : Gemini తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

దూసుకొస్తున్న అక్వాన్ తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ప్రమాదకర రీతిలో దూసుకొస్తోంది. ప్రస్తుతం దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఈ తుపాను చెన్నైకి 590 కి.మీ., మచిలీపట్నానికి 620-650 కి.మీ., విశాఖపట్నానికి 620-660 కి.మీ. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750-780 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది బుధవారం ఉదయానికి తీవ్ర తుపానుగా, గురువారం సాయంత్రానికి మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారనుందని అంచనా వేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కాకినాడ - విశాఖ మధ్య తీరం దాటే ఛాన్స్
Image Credit : Gemini తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

కాకినాడ - విశాఖ మధ్య తీరం దాటే ఛాన్స్

ఈ అక్వాన్ తుపాను శుక్రవారం మధ్యాహ్నం సమయంలో నెల్లూరు, విశాఖపట్నం మధ్య, ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తీరం దాటే సమయంలో సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారనుంది. గడిచిన కొద్ది గంటలుగా గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతున్న ఈ తుపాను ప్రభావం రాబోయే రెండు మూడు రోజులు తీవ్రంగా ఉండనుందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

35
గంటకు 145 కి.మీ వేగంతో భీకర పెనుగాలులు
Image Credit : Gemini తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

గంటకు 145 కి.మీ వేగంతో భీకర పెనుగాలులు

తుపాను తీరానికి సమీపిస్తున్న కొద్దీ గాలుల తీవ్రత భారీగా పెరగనుంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్లు, గరిష్ఠంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు విరుచుకుపడే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

45
కోస్తాంధ్రలో 21 సెం.మీ.కు పైగా కుండపోత వర్షాలు
Image Credit : Gemini తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

కోస్తాంధ్రలో 21 సెం.మీ.కు పైగా కుండపోత వర్షాలు

అక్వాన్ తుపాన్ ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తా తీరంలోని కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకు పైగా కుండపోత వర్షం పడే అవకాశం ఉంది. కేవలం కోస్తాంధ్ర మాత్రమే కాకుండా, నవంబర్ 21న రాయలసీమలోని అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తెలంగాణలోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

55
మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి
Image Credit : Gemini తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి

సముద్రం చాలా ప్రమాదకరంగా మారుతున్నందున మత్స్యకారులు శనివారం వరకు ఎవరూ చేపల వేటకి వెళ్లరాదని స్పష్టం చేశారు. పడవలను తాళ్లతో గట్టిగా కట్టి ఒడ్డున భద్రపరుచుకోవాలి. రైతులు కూడా తమ వ్యవసాయ పనుల్లో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసింది. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 టోల్‌ఫ్రీ నంబర్లను లేదా మనమిత్ర వాట్సాప్ నంబరు 9552300009ను సంప్రదించవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం
తిరుపతి
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 
3rd ODI • AUS vs ENG 2026
Live
AUSAUS
-
ENGENG
-
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
(37.2 ov)121/3
SLSL
98
Day 1
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
తండ్రి వయసున్న వ్య‌క్తి శుభలేఖ ఇస్తే చెట్టపట్టాల్‌ అంటారా.? ష‌ర్మిల తీవ్ర ఆగ్ర‌హం
Recommended image2
School Holidays : నవంబర్ 22, 23, 24 మూడ్రోజులూ సెలవులే.. ఏరోజు, ఎందుకో తెలుసా?
Recommended image3
Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే ఇన్స్‌పెక్టర్ జాబ్
Related Stories
Recommended image1
Laknavaram Lake: తెలంగాణ మాల్దీవులు.. కోనసీమను తలపించే ప్రకృతి అందాలు.. ఒక్కసారైనా చూడాల్సిందే
Recommended image2
MS Dhoni: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై.. కానీ సీఎస్కేతోనే కొత్త ప్రయాణం !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved