MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • తండ్రి వయసున్న వ్య‌క్తి శుభలేఖ ఇస్తే చెట్టపట్టాల్‌ అంటారా.? ష‌ర్మిల తీవ్ర ఆగ్ర‌హం

తండ్రి వయసున్న వ్య‌క్తి శుభలేఖ ఇస్తే చెట్టపట్టాల్‌ అంటారా.? ష‌ర్మిల తీవ్ర ఆగ్ర‌హం

YS Sharmila: ఏపీ రాజకీయాల్లో మరోసారి కుటుంబ సంబంధాలు, రాజకీయ విమర్శల అంశం చర్చనీయాంశంగా మారింది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం తీవ్ర వివాదానికి దారితీసింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 17 2026, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెళ్లి ఆహ్వానానికి రాజకీయ రంగు పులమడంపై షర్మిల ఫైర్
Image Credit : Asianet News

పెళ్లి ఆహ్వానానికి రాజకీయ రంగు పులమడంపై షర్మిల ఫైర్

తన కుమార్తె అంజలిరెడ్డి వివాహానికి సీఎం చంద్రబాబు నాయుడును ఆహ్వానించడాన్ని ఉద్దేశించి సాక్షి పత్రిక ప్రచురించిన కథనంపై వైఎస్ షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక పెళ్లికి పెద్దలను ఆహ్వానించడం సాధారణ సంప్రదాయమని, దానికి అనవసరమైన అర్థాలు ఆపాదించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

చంద్రబాబు తన తండ్రి వయసున్న వ్యక్తి అని, ఆయనకు వివాహ ఆహ్వాన పత్రిక అందిస్తే ఆత్మీయ సంబంధాలకు తప్పుడు పేర్లు పెడతారా అని ప్రశ్నించారు. కనీస సామాజిక మర్యాదలను కూడా రాజకీయ వివాదాల్లోకి లాగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గతంలో వైఎస్సార్ కూడా చంద్రబాబును ఆహ్వానించలేదా?
Image Credit : Asianet News

గతంలో వైఎస్సార్ కూడా చంద్రబాబును ఆహ్వానించలేదా?

ఈ సందర్భంగా తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా షర్మిల ప్రస్తావించారు. గతంలో వైఎస్సార్ తన పిల్లల వివాహాలకు చంద్రబాబు నాయుడును ఆహ్వానించారని గుర్తుచేశారు. అలా ఆహ్వానించినంత మాత్రాన వారిద్దరి మధ్య రాజకీయాలకు అతీతంగా ఏవో సంబంధాలు ఉన్నట్లు భావించాలా అని ప్రశ్నించారు. కుటుంబ శుభకార్యాలకు రాజకీయ నాయకులను పిలవడం మన సంప్రదాయంలో భాగమని పేర్కొన్నారు. ఇలాంటి సాధారణ విషయాలను వివాదాస్పదం చేస్తూ మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయడం తగదని మండిపడ్డారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు.

35
జగన్‌ను నేరుగా ప్రశ్నించిన వైఎస్ షర్మిల
Image Credit : Asianet News

జగన్‌ను నేరుగా ప్రశ్నించిన వైఎస్ షర్మిల

సాక్షి పత్రికలో వచ్చిన కథనం తనకు, తన కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననమని షర్మిల అభివర్ణించారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే వైసీపీ నాయకత్వం.. అదే సమయంలో తమ పత్రికలో ఇలాంటి కథనాలను ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. ఈ కథనానికి బాధ్యత ఎవరిదని, దానిపై వైఎస్ జగన్ స్వయంగా వివరణ ఇస్తారా? లేక సాక్షి పత్రిక ద్వారా సమాధానం చెప్పిస్తారా? అంటూ నిలదీశారు. తల్లి, చెల్లి అనే తేడా లేకుండా మహిళలపై బురదజల్లే కథనాలు ప్రచురించడం వెనుక ఉన్న ఉద్దేశమేంటని ప్రశ్నించారు. ఆత్మీయతతో కూడిన కుటుంబ సంబంధాలకు కూడా తప్పుడు అర్థాలు వెతకడం సమాజానికి మంచిది కాదని పేర్కొంటూ ఈ మేరకు ఎక్స్ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

45
షర్మిలకు మద్దతుగా స్పందించిన నారా లోకేశ్
Image Credit : X/@realyssharmila

షర్మిలకు మద్దతుగా స్పందించిన నారా లోకేశ్

ఈ వివాదంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. షర్మిల కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించడంపై సాక్షి పత్రిక ప్రచురించిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పెద్దలను వివాహ వేడుకలకు ఆహ్వానించడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమని పేర్కొన్నారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కనీస సామాజిక విలువలు, మర్యాదలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మహిళల వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తూ వారి గౌరవానికి భంగం కలిగించే ధోరణికి ఏపీలో చోటు లేదని స్పష్టం చేశారు. సాక్షి ప్రచురించిన కథనం బాధ్యతారహితంగా ఉందని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కుమార్తె వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

55
రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత జీవితాల వరకు.. కొత్త వివాదం
Image Credit : our own

రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత జీవితాల వరకు.. కొత్త వివాదం

ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వివాహ ఆహ్వానం అంశం మరో రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. సాధారణంగా రాజకీయ నాయకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కుటుంబ శుభకార్యాలకు పరస్పరం ఆహ్వానించుకోవడం సహజమే.

అయితే ఈ వ్యవహారంపై సాక్షి పత్రికలో వచ్చిన కథనం షర్మిల ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య విమర్శలు వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకునే స్థాయికి చేరకూడదనే అభిప్రాయం ఈ వివాదంతో మరోసారి తెరపైకి వచ్చింది. ఒకవైపు షర్మిల తన ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేయగా, మరోవైపు లోకేశ్ ఆమెకు మద్దతుగా నిలవడంతో ఈ అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వై. ఎస్. షర్మిల
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
 
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
(37.2 ov)121/3
SLSL
98
Day 1
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : నవంబర్ 22, 23, 24 మూడ్రోజులూ సెలవులే.. ఏరోజు, ఎందుకో తెలుసా?
Recommended image2
Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే ఇన్స్‌పెక్టర్ జాబ్
Recommended image3
Cyclone Aquan: ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. భారీ వర్షాల హెచ్చరిక.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Related Stories
Recommended image1
రాహుల్ గాంధీ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఆమెనా.? మొద‌టిసారి ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన రాహుల్
Recommended image2
భార‌త్‌లో రూ. 65 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న అమెజాన్‌.. ఏ రాష్ట్రంలో ఏంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved