MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • School Holidays : నవంబర్ 22, 23, 24 మూడ్రోజులూ సెలవులే.. ఏరోజు, ఎందుకో తెలుసా?

School Holidays : నవంబర్ 22, 23, 24 మూడ్రోజులూ సెలవులే.. ఏరోజు, ఎందుకో తెలుసా?

స్థానిక సంస్థల ఎన్నికలకు ఓ వీకెండ్, ఇంకో పండగ సెలవు కలిసివస్తున్నాయి… దీంతో వచ్చేవారం ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా మూడ్రోజుల సెలవులున్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Nov 17 2026, 05:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులే సెలవులు
Image Credit : Getty

తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులే సెలవులు

Holidays : తెలుగు రాష్ట్రాల్లో దసరాతో మొదలైన సెలవుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థలు, ఆఫీసులకు వరుస సెలవులు వస్తూనే ఉన్నాయి. దసరా సెలవులు ఇలా ముగిశాయో లేవో తుపానుల సెలవులు ప్రారంభమయ్యాయి… అర్నబ్, మురసు తుపానులతో ప్రమాదం పొంచివున్న జిల్లాల్లో వరుస సెలవులు ఇచ్చారు. ఇక ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సెలవులు కొనసాగుతున్నాయి. ఈ వారాంతంలో కూడా వరుసగా మూడ్రోజుల సెలవులున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నవంబర్ 22న సాధారణ సెలవు
Image Credit : Gemini AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

నవంబర్ 22న సాధారణ సెలవు

నవంబర్ 22న ఆదివారం... కాబట్టి ప్రతి వీకెండ్ మాదిరిగానే ఈరోజు సాధారణ సెలవు ఉంది. అయితే తర్వాత రెండ్రోజులు (సోమ, మంగళవారం) కూడా ప్రత్యేక సెలవులు ఉండటంతో విద్యార్థులు, ఉద్యోగులకు ఈ ఆదివారం సెలవు కలిసివస్తోంది... వరుసగా మూడ్రోజుల సెలవులు వస్తున్నాయన్నమాట.

34
నవంబర్ 23న సెలవు... ఎందుకో తెలుసా?
Image Credit : ANI

నవంబర్ 23న సెలవు... ఎందుకో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి... అయితే వివిధ కారణాలతో కొన్ని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసి నోటిఫికేషన్ జారీ చేసింది... ఇప్పటికే మొత్తం 23 చోట్ల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యింది.

నవంబర్ 23న అంటే వచ్చే సోమవారం వివిధ పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక్కడి ఉద్యోగులకు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ పోలింగ్ రోజు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నవంబర్ 23న సెలవు ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి... దీంతో సెలవులు ప్రకటన వెలువడింది.

కేవలం ఉద్యోగులకే కాదు విద్యార్థులకు కూడా నవంబర్ 23న సెలవు ఉండనుంది. పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసేది ప్రభుత్వ పాఠశాలల్లోనే... కాబట్టి అక్కడ చదివే విద్యార్థులకు సెలవు ఉంటుంది. ఇలా మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వచ్చే సోమవారం ప్రత్యేక సెలవు ఉంది.

మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాలివే..

మున్సిపల్ కార్పోరేషన్లు : శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి , మంగళగిరి-తాడేపల్లి

మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు : ఆముదాలవలస, రాజాం, పాలకొల్లు, బీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట, బాపట్ల

ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ నగరాలు, పట్టణాల్లో నవంబర్ 23న పోలింగ్ జరగనుంది... కాబట్టి ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు వర్తిస్తుంది.

44
నవంబర్ 24న సెలవు
Image Credit : getty

నవంబర్ 24న సెలవు

ప్రస్తుతం కార్తీక మాసం కొనసాగుతుంది... ఇది హిందువులకు ఎంతో పవిత్రమైన నెల. ఇక కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకమైందిగా భావిస్తారు.. ఈరోజు దేవాలయాలు, ఇళ్లలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అందుకే ప్రతి కార్తీక పౌర్ణమి మాదిరిగానే ఈసారి కూడా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారిక సెలవు ఉంది. నవంబర్ 24న (వచ్చే మంగళవారం) కార్తీక పౌర్ణమి సెలవు.

గమనిక : మున్సిపల్ ఎన్నికలు జరిగే నగరాలు, పట్టణాల్లోనే వరుసగా మూడ్రోజులు సెలవులు ఉంటాయి. మిగతాచోట్ల నవంబర్ 22 (ఆదివారం), నవంబర్ 24 (మంగళవారం) మాత్రమే సెలవు ఉంటుంది... నవంబర్ 23న యదావిధిగా వర్కింగ్ డేనే.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
(37.2 ov)121/3
SLSL
98
Day 1
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే ఇన్స్‌పెక్టర్ జాబ్
Recommended image2
Cyclone Aquan: ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. భారీ వర్షాల హెచ్చరిక.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Recommended image3
Cyclone Akvan : తీవ్ర కాదు అత్యంత తీవ్ర తుపానుగా అక్వాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, గాలివానలతో అల్లకల్లోలమే
Related Stories
Recommended image1
Birds Facts : పక్షులు చెట్టు చిటారుకొమ్మలపై నిద్రించినా ఎందుకు కిందపడిపోవు? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Recommended image2
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. వారానికి 5 రోజులే స్కూల్స్.. శనివారం కూడా సెలవు? అసలు రీజన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved