- Home
- Andhra Pradesh
- Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే ఇన్స్పెక్టర్ జాబ్
Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే ఇన్స్పెక్టర్ జాబ్
ఆంధ్ర ప్రదేశ్ యువతీయువకులకు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశం. APPSC నుండి అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలవడింది.

గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్
Government Jobs : ఖాకీ డ్రెస్ వేయాలన్నది చాలామంది కల... పోలీస్ కావాలంటే పోటీ పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్స్ (రన్నింగ్, లాంగ్ జంప్ వంటివి) లో కూడా అర్హత సాధించాలి. అయితే ఎక్సైజ్, రవాణా శాఖలో మాత్రం రాత పరీక్షలో అర్హత సాధిస్తే చాలు... ఫిజికల్ ఈవెంట్స్ లేకుండా నేరుగా ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశమే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ యువతీయువకులకు వచ్చింది. రాష్ట్ర రవాణా శాఖ పరిధిలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. RTO (Regional Transport Office) ఆఫీసులో అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తించే ఉన్నత ఉద్యోగం ఈ అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్.
ఏపిపిఎస్సి నుండి AMVI జాబ్ నోటిఫికేషన్
ప్రభుత్వ ఉద్యోగాల నియామక సంస్థ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 50 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది... జోన్ల వారిగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
దరఖాస్తు విధానం
ఈ నెల (నవంబర్) 6 నుండే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది.
2026 నవంబర్ 26వ తేదీ రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఏపిపిఎస్సి అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in ద్వారా ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు - 250 రూపాయలు
ఎగ్జామినేషన్ ఫీజు - 120 రూపాయలు
ఎస్సి, ఎస్టి, బిసి, మాజీ సైనికులకు రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు.
ఏ ఫీజు అయినా ఆన్ లైన్ లోనే చెల్లించాలి.
విద్యార్హతలు
మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ AMVI ఉద్యోగాలకు అర్హులు. దేశంలో గుర్తింపుపొందిన ఏదైనా విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థలో చదివి ఉండాలి.
వయో పరిమితి
21 నుండి 36 ఏళ్లలోపు వారు అర్హులు (02.07.2026 వరకు గల వయసును పరిగణలోకి తీసుకుంటారు)
వయసు సడలింపు
ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులు - 5 ఏళ్ల సడలింపు
మాజీ ఆర్మీ ఉద్యోగులు లేదా N.C.C Instructor గా పనిచేసినవారు - 3 ఏళ్ల సడలింపు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సడలింపు వర్తిస్తుంది. అయితే కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేసేవారు మాత్రం అనర్హులు.
రాత పరీక్ష విధానం
మొత్తం రెండు పేపర్లు, 450 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది.
పేపర్ 1 : జనరల్ స్టడీస్ ఆండ్ మెంటల్ ఎబిలిటి (డిగ్రీ స్థాయిలో) - 150 ప్రశ్నలు (150 నిమిషాల సమయం) - 150 మార్కులు
పేపర్ 2 : ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (డిప్లొమా ప్థాయి) - 150 ప్రశ్నలు (150 నిమిషాల సమయం) - 300 మార్కులు
శాలరీ
నెలనెలా రూ.48,440 నుండి రూ.1,37,220 వరకు ఉంటుంది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్నిరకాల అలవెన్సులు కూడా వర్తిస్తాయి. ఇలా మంచి శాలరీతో పాటు మంచి హోదా కలిగిన ఈ ఉద్యోగం పొందితే సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. కాబట్టి అన్ని అర్హతలు కలిగిన యువతీయువకులు గట్టిగా ట్రై చేస్తే అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని సాధించవచ్చు... ఖాకీ డ్రెస్ వేసుకోవాలన్న కలను నెరవేర్చుకోవచ్చు.









