ప్రస్తుతం డిజిటల్ మాయ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్ని నిజమని నమ్మే బ్యాచ్ లు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఓ మూడు అంశాలు భాగా ప్రచారం అవుతున్నాయి. వాటిలో నిజానిజాలు తెలుసుకుందాం. 

1 “చైనా లో ప్రైవేట్ బడులు బ్యాన్”..తెగ వైరల్ చేస్తున్న నెటిజనులు…

మరి వాస్తవం..

చైనాలో ప్రైవేట్ బడులను నిషేదించలేదు. ఇప్పటిదాక ప్రైవేట్ బడులు లాభాలు ఆర్జించుకొనే అవకాశముండేది. 2021 నుంచి చైనా ఈ రూలు మార్చింది. విదేశీ ఈక్విటీ కంపెనీలు లాభాపేక్షతో బడులు పెట్టకూడదు అని చట్టం చేసింది. ఇదివరకే ఉన్న ప్రైవేట్ బడులు లాభాపేక్షతో కాకుండా నో లాస్ నో ప్రాఫిట్ ఆధారంగా నడపాలని నిర్దేశించింది.

మరి ఇండియా సంగతి..?

ఇండియాలో ఎప్పటినుంచో ఈ రూల్ ఉంది. కాకపోతే అది అమలు కాదు. దొడ్డిదారిలో ప్రైవేట్ బడులు దోచేస్తాయి. బాగా దోచుకొనే అవకాశముంది కాబట్టే ఫారిన్ ఈక్విటీ కంపెనీలు వందలకోట్లు పెట్టి సిబిఎస్సీ బడుల్ని కొనేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వారు, ఫార్మా కంపెనీ వారు కోట్లు కుమ్మరించి కొత్త బడులు పెట్టి వాటిని క్లబ్బులా అలంకరిస్తున్నారు, నవతరం పేరెంట్స్ కూడా ఇలాంటి బడులు.. అంటే ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటే అంత గొప్ప బడి అనుకొని వాటి వైపు ఆకర్షితులు అవుతున్నారు.

ప్రభుత్వ బడుల్లో సంవత్సరానికి సగటున ఒక విద్యార్థి కి లక్ష రూపాయిలు ఖర్చు. ఇరవై ముప్పై వేలకే కొన్ని బడులు ఎలా విద్యనందిస్తున్నాయి అనే విషయంపై చర్చ జరిగితే బాగుండు. విద్యార్థుల్లో చదివే గుణం తగ్గిపోయింది అని ప్రతి ఉపాద్యాయుడు గోషిస్తుంటే.. ఈ కాలం విద్యార్థులు చక్కగా చదువుతున్నారు కాబట్టే మాక్సిమం మార్కులు వస్తున్నాయి అని ప్రచారం. దీని బట్టి విద్య మాఫియా ఎంత పవర్ఫుల్ అని గ్రహించవచ్చు. చదువంటే కేవలం మార్కులు.. ఎంత ఎక్కువ ఫీజు ఉంటే.. ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటే... అంత గొప్ప బడి అనుకొనే పేరెంట్స్ ఉన్నంత కాలం పిల్లల చదువులు సరిగా సాగవు.

2. రెండో అంశం

బతకడం కోసం సొంత ఒంటిని పెట్టుబడిగా పెట్టడం అనేది అతి పురాతన వ్యాపారం. డిజిటల్ ఏజ్ లో ఇది సునామీలా మారింది. ఆన్లైన్ లో అందాలను ప్రదర్శిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నవారు ప్రపంచ వ్యాపితంగా కనీసం లక్ష మంది ఉన్నారని ఈ రంగంపై స్టడీ చేసిన ఉన్నత అధికారుల అంచనా . తెలుగు నాట ఇది ఇప్పుడు కొత్త వేళ్లూను కొంటోంది. వీరికి ప్రచార కర్తలుగా మీడియా మారుతోంది. ఇదేదో ప్రపంచంలో ఇప్పటిదాకా దాక జరగనట్టు ఇక్కడే కొత్తగా మొదలయినట్టు మీడియా అయ్యో కుయ్యో అని వార్త కథనాలు ప్రసారం చెయ్యడం.. దాన్నే పబ్లిసిటీ గా ఇలాంటి వారు రెచ్చి పోవడం జరుగుతోంది. రాబొయే రోజుల్లో వందలమంది తెలుగు వారు ఈ దందాలోకి దిగడానికి రంగం సిద్ధమవుతోంది.

3. మూడో అంశం

చచ్చిన వ్యక్తుల ఇన్సూరెన్సు డబ్బుల కోసం... ఆస్తుల కోసం ఒక కుటుంబం రెండుగా విడి పోయి యు ట్యూబ్ చానెల్స్ లో కొట్టుకు చస్తున్నారు. నిన్నటి దాక నిజాలను తొక్కి పెట్టేసారు." మా వారు బంగారం ఏమీ సమస్యలు లేవు" అని పదేపదే చెప్పిన వారు ఇప్పుడు డబ్బుల కోసం పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నారు. వారి వ్యక్తిగత గోల మనకెందుకు అనిపిస్తుంది. కానీ మనుషులు డబ్బుకోసం ఇంత దిగజారతారా..? అని మొత్తం సమాజాన్ని చెడగొట్టేలా ఈ ప్రచారం జరుగుతోంది .ఈ కేసులో పోలీస్ లు నిజాలు ఎప్పటికి చెబుతారో..?