'ఫలక్ నుమా దాస్' సినిమాతో ఒక్కసారిగా దూసుకువచ్చాడు నటుడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాదు.. దర్శకత్వ బాధ్యతలు కూడా తనే తీసుకున్నాడు. సినిమా విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది.

అయితే ఈ సినిమా విడుదలకు ముందు తరువాత విశ్వక్ సేన్ చేసిన హడావిడి అంత సులువుగా మర్చిపోలేం. విజయ్  దేవరకొండ పై విశ్వక్ సేన్ కామెంట్స్ చేశాడని ఆయన అభిమానులు విశ్వక్ సేన్ పై విరుచుకుపడ్డారు. కొందరు 'ఫలక్ నుమా దాస్' సినిమా పోస్టర్లు చింపడం వంటి పనులు చేశారని విశ్వక్ మండిపడ్డాడు.

ఓ వర్గం వారు కావాలని తన సినిమాపై నెగెటివ్ పబ్లిసిటీ వచ్చేలా చేస్తున్నారని బూతులతో విరుచుకుపడ్డాడు. తాజాగా మరోసారి సినిమా సక్సెస్ మీట్ లో తనదైన స్పీచ్ తో రెచ్చిపోయాడు ఈ యువ హీరో. ''తొక్కడానికి నేనేమైనా కోకో కోలా టిన్ నా..? లేక తాగి పడేసిన సిగరెట్ పీకనా..? ఎవడ్రా నన్ను తొక్కేది..?'' అంటూ తన మాటలతో విరుచుకుపడ్డాడు. 

అంతేకాదు వచ్చే ఏడాదిలో మరిన్ని బూతు డైలాగ్స్ ఉండేలా 'ఫలక్ నుమా దాస్ 2' సినిమాను రిలీజ్ చేస్తానని షాక్ ఇచ్చాడు. ఈ యువ హీరో దూకుడు చూస్తుంటే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా మారేలా ఉన్నాడు.  

నెగిటివ్ కామెంట్స్ కి బూతులతో ఆన్సర్ ఇచ్చిన హీరో

దేవరకొండపై యంగ్ హీరో పంచ్?

ఫిమేల్ యాంకర్ ని ఆడేసుకున్న విశ్వక్ సేన్!

నేను తీసినట్లు ఎవరైనా సినిమా తీయగలరా..? విశ్వక్ సేన్ కామెంట్స్!